Suryaa.co.in

Andhra Pradesh

దిశ చట్టం పేరుతో మహిళల్ని మోసం చేసిన మోసగాడు జగన్ రెడ్డి

సొంత చెల్లిని ఒంటరిని చేసి పక్క రాష్ట్రానికి తరిమేసినోడు రాష్ట్రంలో ఉన్న మహిళలకు రక్షణ కల్పిస్తాడా? జగన్ రెడ్డి పాలనలో అన్ని ప్రశ్నలే…సమాధానాలు ఉండవు. అసలు దిశ చట్టం ఉందా? లేని దిశ చట్టం తో ముగ్గురికి ఉరి శిక్ష, 20 మందికి జైలు శిక్ష ఇది చెప్పింది ఎవరు? స్వయంగా రాష్ట్ర హోంమంత్రి గారు మేకతోటి సుచేరిత గారు చెప్పారు. లేని దిశ చట్టంతో ఇద్దరికి ఇద్దరికి ఉరి శిక్ష, ఐదుగురికి జీవిత ఖైదు, మొత్తంగా 20 మందికి కఠిన శిక్షలు పడ్డాయి. ఇది చెప్పింది ఎవరు? స్వయంగా రాష్ట్ర డిజిపి సవాంగ్ గారు. పోలీసు దర్యాప్తు 7 రోజుల్లో పూర్తి చేస్తాం, 14 రోజుల్లో న్యాయ ప్రక్రియ పూర్తి చేస్తాం. 21 పనిదినాల్లో మహిళల పై చెయ్యి వేసినవాడికి ఉరి శిక్ష వేస్తాం అన్నది ఎవరు? స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. జగన్ రెడ్డి గారి ఇంట్లో మహిళలకు రక్షణ ఉందా? ఆయన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఆడ బిడ్డలకు భద్రత ఉందా? సీఎం గారి సొంత నియోజకవర్గం పులివెందుల లో ఆడపడుచులకు రక్షణ ఉందా? జగన్ రెడ్డి గారి చెల్లెమ్మ వైఎస్ సునీతా రెడ్డి గారు తనకి రక్షణ లేదంటున్నారు. తాడేపల్లి ప్యాలస్ పక్కన యువతి పై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకూ నిందితులను అరెస్ట్ చెయ్యలేదు. ఆ కేసులో ఒక్కడే ఎందుకు దొరికాడు? ఇంకొకడు ఎందుకు దొరకలేదు? ఒక సామాజికవర్గానికి చెందిన వాడిని రక్షించడానికి ఒక ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇక జగన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ ని దారుణంగా చంపేస్తే ఈ రోజు వరకూ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. విచిత్రం ఏంటంటే పార్లమెంట్ సమావేశాల సంధర్భంగా వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. దిశ చట్టం పై కేంద్రం వివరణ అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన కూడా లేదని కేంద్రం సమాధానమిచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 517 ఘటనలు జరిగాయి. ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్ష పడలేదు. కర్నూలు జిల్లా గొనెగండ్లలో మైనార్టీ యువతి హాజీరాని దారుణంగా చంపి ఏడాది అయ్యింది.ఆ కేసు ముందుకు కదలలేదు.కడప జిల్లా బద్వేల్ లో శిరీష ని అత్యంత కిరాతకంగా చంపిన వాళ్ళు బెయిల్ పై బయట తిరగడమే కాకుండా తల్లిదండ్రులను చంపుతామని బెదిరిస్తున్నారు. ప్రొద్దుటూరు లో ఉన్మాది కత్తికి బలైన లావణ్య కి వైద్యం చేయించడానికి తల్లిదండ్రులు ఇంట్లో బంగారం అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ కేసులో కూడా నిందితులు బెయిల్ పై బయట తిరుగుతున్నారు. విశాఖపట్నం లో వాలంటీర్ ప్రియాంక పై దాడి చేసిన వాడు బెయిల్ పై బయటకొచ్చాడు. ప్రియాంక కి వైద్యం చేయించడానికి 9 లక్షల ఖర్చు అయ్యింది. ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు. అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలతని కిరాతకంగా చంపేసారు. విజయవాడ తేజశ్వని ని అత్యంత ఘోరంగా గొంతు కోసి చంపేసారు. గాజువాక లో వరలక్ష్మిని బ్లేడ్ తో మెడ కోసి చంపేసాడు మరో మృగాడు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనూష ని ఒక మృగాడు కిరాతకంగా చంపేసాడు. అనూష కుటుంబం పోరాటం చేసిన తరువాత నిందితుడిని అరెస్ట్ చేసారు. ఆరు నెలలైంది అనూషని అన్యాయంగా చంపేసిన విష్ణువర్థన్ రెడ్డి కి ఉరి శిక్ష పడిందా? హ్యాపీగా బెయిల్ పై బయటకొచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు.స్థానిక ఎమ్మెల్యే కి కనీసం చనిపోయిన అమ్మాయి పేరు తెలియదు. పైగా డబ్బిచాం కదా అని ఎగతాళి చేసేలా మాట్లాడారు. గుంటూరు లో దళిత యువతి రమ్య ని అత్యంత క్రూరంగా వెంటాడి చంపేసాడు మృగాడు. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది,బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయిని చంపేసాడు. స్తోమతలేకపోయినా రమ్యని తల్లిదండ్రులు బాగా చదివించారు. 21 పనిదినాల్లో ఉరి అన్నారు. రమ్య హంతకుడ్ని ఎందుకు ఉరి తియ్యలేదు? నేను 21 రోజుల్లో రమ్యకు న్యాయం చెయ్యాలని ఉద్యమం మొదలు పెట్టిన తరువాత నిజాన్ని ఒప్పుకున్నారు. హోంమంత్రి గారు, డిజిపి సవాంగ్ గారు దిశ చట్టం లేదని అంగీకరించారు. ఇంత కాలం జగన్ రెడ్డి గారు మహిళల్ని దిశ చట్టం పేరుతో మోసం చేసారని స్వయంగా హోంమంత్రి గారు, డిజిపి సవాంగ్ గారు ప్రకటించారు. ఈ 21 రోజుల్లో ఎన్ని ఘోరాలు జరిగాయో మీకు తెలుసా? 16 ఘటనలు జరిగాయి. గుంటూరు లో బాలిక పై సామూహిక అత్యాచారం దగ్గర నుండి విజయనగరం జిల్లా లో యువతి పై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన వరకూ 17 ఘోరమైన ఘటనలు జరిగాయి.


జగన్ రెడ్డి పాలన లో ఆడపిల్లల పై అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ ని కేర్ అఫ్ అడ్రస్స్ గా మారింది. మహిళలకు రక్షణ కల్పించమని అడిగితే మాపై ఎదురుదాడి,కేసులు,అరెస్టులు. పైగా మేము రమ్య కుటుంబానికి న్యాయం చేసేసామని చెబుతున్నారు. ఆర్థిక సహాయం చేసాం, స్థలం ఇచ్చాం, ఉద్యోగం ఇచ్చాం అని చెబుతున్నారు. అయ్యా జగన్ రెడ్డి నీ సొంత జేబులోంచి ఏమైనా ఇస్తున్నావా? అది దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎస్సి ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో ఉన్నవి కాకుండా ఒక్క రూపాయి ఎక్కువ నువ్విచావా? నువ్విచ్చే డబ్బుతో చనిపోయిన రమ్యని తిరిగి తీసుకురాగలవా? బాధిత కుటుంబాలకు జరిగిన న్యాయం తక్కువ. దిశ చట్టం, దిశ యాప్ తో జగన్ రెడ్డి కొట్టేసింది ఎక్కువ. దిశ చట్టం,దిశ యాప్ పేరు చెప్పి సొంత పత్రిక,ఛానల్ కి 30 కోట్లు ప్రకటనలు ఇచ్చుకున్నారు.

పాదయాత్ర లో ఓట్ల కోసం ముద్దులు పెట్టారు. 517 మంది ఆడబిడ్డలు బలైపోతే జగన్ రెడ్డి తాడేపల్లి కొంప నుండి అడుగు ఎందుకు బయట పెట్టలేదు. ఒక్క కుటుంబాన్ని కూడా ఎందుకు ఓదార్చలేదు? పాదయాత్ర లో గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని బిల్డప్ ఇచ్చారు. అది బుల్లెట్ లేని గన్ అని తేలిపోయింది. గన్ను రావడం లేదు జగన్ నిద్రలేవడం లేదు. మాయ మాటలతో కాలక్షేపం మానండి జగన్ రెడ్డి గారు ఇలాంటి ఘటన మీ ఇంట్లో జరిగితే ఇలానే స్పందిస్తారా? ఇక్కడితో మా ఉద్యమం ఆగదు.21 రోజుల ఉద్యమం ఆరంభం మాత్రమే ఇచ్చిన హామీ ప్రకారం 21 రోజుల్లో నిందితులకు ఉరి శిక్ష పడే వరకూ మహిళలకు అండగా మేము పోరాటం చేస్తాం. 3 వేల మంది పోలీసుల్ని పెట్టి నన్ను ఆపినంత మాత్రాన నా ఉద్యమం ఆగదు. నేను వస్తున్నా అని నరసరావుపేటలో యుద్ధ వాతావరణం సృష్టించి ప్రజల్ని పోలీసులు ఇబ్బందులకు గురిచేసారు.దిశ అంటూ మోసం చేసిన సీఎం జగన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలి. దిశ చట్టం అంటూ మహిళల్ని దగా చేసారు. నిర్భయా చట్టం కింద కేసులు పెట్టి ఉంటే నిందితులకు శిక్ష పడి ఉండేది.

మహిళలకు రక్షణ కల్పించలేని దొంగ చట్టం కాబట్టి చట్టం ప్రతులను తగలబెట్టిన నారా లోకేష్,టీడీపీ నేతలు.మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ..తండ్రి శవం పక్కన ఉండగానే సంతకాలు, సంవత్సరాలు తరబడి దొంగ ఓదార్పు యాత్రలు చేసింది ఎవరో రాష్ట్రమంతా తెలుసు.

LEAVE A RESPONSE