Suryaa.co.in

Telangana

రాజ్యాధికారమే లక్ష్యంగా సాగుదాం

– ఎంపీ వద్దిరాజు

హైదరాబాద్ : రాజ్యాధికారమే లక్ష్యంగా, ధ్యేయంగా ముందుకు సాగుదామని మున్నూరుకాపులు,బీసీలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. బీసీలు అన్ని రంగాలలో బాగా వెనుకబడి పోయారని,గత ప్రభుత్వంతో పోల్చితే ఈసారి అసెంబ్లీలో ప్రాతినిథ్యం తగ్గిందని ఆవేదన వ్యక్తంచేశారు.

“ట్రస్ట్ ఆఫ్ పటేల్స్ (టాప్)”ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ శివార్లలోని నాగారం ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత తెలంగాణలో మున్నూరుకాపు మంత్రి లేని సందర్భాన్ని మనమిప్పుడు చూస్తున్నామన్నారు.త్వరలో జరుగుతుందని భావిస్తున్న మంత్రివర్గ విస్తరణలో మున్నూరుకాపుకు ఇతర బీసీలకు స్థానం లభించాలని కోరుకుంటున్నానన్నారు.

ఈ సమావేశానికి మున్నూరుకాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ కోర్ కమిటీ సభ్యులు రౌతు కనకయ్య అధ్యక్షత వహించగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వీ.ప్రకాష్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు సీ.విఠల్, మున్నూరు కాపు ప్రముఖులు డాక్టర్ జే.ఎన్.వెంకట్, మరికల్ పోత సుధీర్ కుమార్, సత్తు మల్లేష్, ఎర్రా నాగేందర్, మీసాల చంద్రయ్య,ఊసా రఘు, లవంగాల అనిల్,పడాల భిక్షపతి,తెల్లా శ్రీధర్,తాడెం రమేష్, తోట వెంకటప్రసాద్, తెల్లా మురళీధర్,నేతి మంగమ్మ, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, గాలి శ్రీనివాస్ తదితరులకు జ్ఞాపికలు ప్రదానం చేసి గౌరవించారు.

LEAVE A RESPONSE