– డిప్యూటీ సీఎం భట్టి సవాల్‌కు హరీష్‌రావు సై
– ఆడిటర్లు, ఆర్ధిక నిపుణులను పిలిచి ప్రత్యేకంగా సభ పెట్టండి
– ఏడాదిలో కాంగ్రెస్ చేసిన అప్పులు 55 వేల 277 కోట్లు
– మా పదేళ్ల హయాంలో చేసిన అప్పులు 4,17,496 కోట్లు మాత్రమే
– నిధులున్నా ఎందుకు అప్పు చేస్తున్నారు?
– అసెంబ్లీలో మాజీ మంత్రి, హరీష్‌రావు సవాల్
ఆర్బిఐ కంటే గొప్పవాళ్ళు ఎవరు ఉంటారు ఆర్థిక విషయాల్లో?
స్పీకర్ మాకు మాత్రమే నీతులు చెప్తారు కానీ అధికార పార్టీకి ఎందుకు చెప్పరు ?
– కాంగ్రెస్ ప్రభుత్వ అప్పులపై చేస్తున్న తప్పుడు ప్రచారంపై అసెంబ్లీ వేదికగా లెక్కలతో సహా వాస్తవాలను వివరించిన మాజీ మంత్రి హరీష్ రావు
ఈరోజు ఆర్బిఐ లెక్కల ప్రకారం 55 వేల 277 కోట్లు FRBM అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు 1 లక్ష 27 వేల 208 కోట్లు. అంటే ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయబోయే అప్పు 6 లక్షల 36,400 కోట్లు. బీఆర్ఎస్ కాలంలో చేసిన మొత్తం అప్పు 4,17,496 కోట్లు మాత్రమే. ఐ చాలెంజ్ ఇన్ దిస్ హౌస్. ఒకరోజు స్పెషల్ డిబేట్ పెట్టండి. ఆడిటర్లను, ఫైనాన్స్ నిపుణులను పిలిచి డిబేట్ పెట్టండి ఐ విల్ ప్రూవ్. కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేను భట్టి సవాలు స్వీకరిస్తున్నాను. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న భట్టి పై ప్రివిలేజ్ మోషన్ పెట్టి చర్చకు అవకాశం ఇవ్వండి.
నేను 21 సంవత్సరాలుగా ఈ సభలో ఉన్నాను. మంత్రిగా పనిచేశాను. ప్రతిపక్షంలో ఉన్నాను. కానీ స్పీకర్ ప్రశ్న చదివినప్పుడు మంత్రి సీట్లో లేకపోయిన సందర్భం ఇదొక్కటే. సభలో ప్రశ్నోత్తరాలు ఉన్నప్పుడు భట్టి విక్రమార్క సభలో లేకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు 51277 కోట్లు అని చెప్పారు. ఈరోజు ఆర్బిఐ లెక్కల ప్రకారం 55 వేల 277 కోట్లు FRBM అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ‘లక్ష 27 వేల 208 కోట్లు. అంటే ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయబోయే అప్పు 6 లక్షల 36,400 కోట్లు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఫైనాన్స్ వైట్ పేపర్ ఆధారంగా చాలాసార్లు స్పష్టంగా చెప్పడం జరిగింది.
గతంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పు శ్వేత పత్రంలో 6,71,757 కోట్లు అన్నారు. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి సహా మంత్రులు 7 లక్షల కోట్లు అంటారు. ఈరోజు మీరు 7,11,911 కోట్ల అప్పు అంటారు. నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. ఐ చాలెంజ్ ఇన్ దిస్ హౌస్. ఒకరోజు స్పెషల్ డిబేట్ పెట్టండి. ఆడిటర్లను, ఫైనాన్స్ నిపుణులను పిలిచి డిబేట్ పెట్టండి ఐ విల్ ప్రూవ్. బీఆర్ఎస్ కాలంలో చేసిన మొత్తం అప్పు 4,17,496 కోట్లు మాత్రమే. గతంలో భట్టి విక్రమార్క ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉంది అని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గత ప్రభుత్వం చేసిన అప్పులు అని తప్పుడు ప్రచారం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ లెక్కలు ఆర్బిఐ ప్రకటించిన లెక్కలు. ఆర్బిఐ కంటే గొప్పవాళ్ళు ఎవరు ఉంటారు ఆర్థిక విషయాల్లో?
రెండుసార్లు కరోనా రావడం దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవ్వడం వల్ల రాష్ట్రాలు 1.75 శాతం అదనంగా అప్పులు తీసుకొని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలని కేంద్రం చెప్పడం వల్ల చేసిన అప్పులే. స్పీకర్ మాకు మాత్రమే నీతులు చెప్తారు కానీ అధికార పార్టీకి ఎందుకు చెప్పరు ? డివియేట్ కాకుండా మా పరిధిలో మాత్రమే మేము మాట్లాడుతున్నాము. సభలో జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు.
డిప్యూటీ సీఎం రూల్స్ గురించి మాట్లాడారు.. అసెంబ్లీ రూల్ బుక్ పేజీ నెంబర్ 86లో బీఏసీ కమిటీలో ప్రవేశ పెట్టబోయే బిల్లులను సభలో ప్రవేశపెట్టాలి. బీఏసీలో పెట్టకుండా రెండు బిల్లులను సభలో పెట్టారు అని మాత్రమే మేము అన్నాం. కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో 1,27, 208 కోట్ల అప్పు చేసింది. 6 లక్షల 36 వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న అయిదు ఏళ్లలో అప్పు చేయనుంది. భట్టి విక్రమార్క పై ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో స్పీకర్ క్లారిఫై చేయాలి. విక్రమార్క మధిరలో మాట్లాడిన దానిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామని సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర అప్పులపై గత అసెంబ్లీ సమావేశాల్లో తప్పుడు లెక్కలు ఇచ్చి అసెంబ్లీని తప్పు దోవ పట్టించారని మేము ప్రివిలైజ్ మోషన్ ఇచ్చాం. వ్యవసాయ కూలీలకే కాదు, 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నేను భట్టి సవాలు స్వీకరిస్తున్నాను.అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న భట్టి పై ప్రివిలేజ్ మోషన్ పెట్టి చర్చకు అవకాశం ఇవ్వండి.