– శాసనసభ క్వశ్చన్ అవర్ లో బిల్లుల చెల్లింపు పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన ఒక్క పథకం సక్రమంగా అమలు కావడం లేదు. ఆరు గ్యారెంటీలు..13హామీలు ఊసే లేదు. రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అయినా సంవత్సర కాలంగా లక్ష 27వేల కోట్ల అప్పు తెచ్చారు. CDP ,SDF ద్వారా చేపట్టిన చిన్న చిన్న పనులకు కూడా బిల్స్ ఎందుకు క్లియర్ చేయట్లేదు? నా బాల్కొండ నియోజకవర్గంలోనే పలు కుల సంఘ భవనాలు,మహిళా భవనాలు,కళ్యాణ మండపం, బడులు, ఇప్పటి వరకు 143 పనులకు 6 కోట్ల బిల్లులు చెల్లించలేదు. 33 గుళ్లకు 3 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించలేదు.ఇది ఒక్క బాల్కొండ సమస్య కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల సమస్య. చిన్న బిల్లులు ప్రభుత్వం వెంటనే క్లియర్ చేయాలి.వాళ్ళు కాంట్రాక్టర్లు కాదు. విద్యా కమిటీలు,ఆయా కుల సంఘాల వాళ్ళు,మహిళా సంఘాల వాళ్ళు జమై కట్టించుకున్నారు.అట్లాంటి చిన్న చిన్న బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. వారు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యేలు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. అట్లాంటి చిన్న బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతున్నాం.