– ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోదిగుతున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ విజయం చేకూరుద్దామని, ఆ దిశగా కూటమి శ్రేణులు పనిచేయాలని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పిలుపునిచ్చారు.
అశోక్ నగర్ లోని తూర్పు తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ నేతృత్వంలో కూటమి శ్రేణులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిచయ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ.. గత వైకాపా పాలనలో టిడిప్ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుంటే చంద్రబాబుకు అత్యంత దగ్గరగా ఉండి, న్యాయ విభాగానికి నాయకత్వం వహించి కార్యకర్తలకు అండగా నిలిచారన్నారు.
ఎం.పి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ..చాలా మంది ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవడం లేదు, దాని బాధ్యతను కూటమి శ్రేణులు తీసుకోవాలన్నారు. ఈస్ట్ లో అత్యధికంగా రాజాకు మెజార్టీ వస్తుందని కేశినేని చిన్ని ధీమావ్యక్తం చేశారు.
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కూటమి శ్రేణులు కషితో పనిచేసి రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించారన్నారు. గత పాలనలో వైపిసి వారు మాటల్లో భావదారిద్యం, భాషా దారిద్యంతో ప్రజలు సిగ్గుపడ్డారన్నారు. వరదల్లో చంద్రబాబు ఒక యువకుడిలా పనిచేసి 12 రోజుల్లో యదస్థానానికి తీసుకువచ్చారన్నారు. అప్పుడు బయటకి రాని వైకాపా వారు మళ్ళీ రోడ్లపైకి వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తూ కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుకు కృషిచేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు.
జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ.. ఆలపాటి రాజా తమ జనసేన పార్టీకి సీటు త్యాగం చేశారని వారి త్యాగానికి ప్రతిఫలంగా రాజాను గెలిపించుకునే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు.
జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా గెలుపు నల్లేరుపై నడకేనన్నారు. జనరల్ ఎన్నికల్లో ఎంత ఉత్సాహంగా పనిచేశారో అంతే ఉత్సాహంగా ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించి, గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, పోతంశెట్టి నాగేశ్వరరావు, గద్దె క్రాంతికుమార్లతో పాటు పలువురు కార్పొరేటర్లు, టిడిపి, జనసేన, బి.జె.పి పార్టీ నాయకులు పాల్గొన్నారు.