Suryaa.co.in

Andhra Pradesh

బీసీలను తనబానిసలుగా మార్చాలనుకుంటున్న జగన్ ఆటలు సాగనివ్వం

– 4 ఏళ్లుగా బీసీల్ని వంచించి, తప్పుడుకేసులతో హింసించి, వారిప్రాణాలుతీసి, ఆస్తులు ధ్వంసంచేసిన జగన్ మరలా కొత్తనాటకాలతో బీసీల్ని మోసగించడానికి సిద్ధమయ్యాడు.

• రాష్ట్రంలోని బీసీలవద్దకువెళ్లి, వారిసమస్యులు తెలుసుకొని, వారి కష్టాలు తీర్చడానికే టీడీపీ బీసీభరోసా బాట కార్యక్రమం చేపట్టింది.
• బీసీ భరోసా బాటను అడ్డుకోవడానికి జగన్ పోలీసుల్ని, వైసీపీ గూండాలను ఉసిగొల్పుతున్నాడు.
• తలకిందులుగా తపస్సుచేసినా జగన్ బీసీభరోసాబాటను అడ్డుకోలేడు.

– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర

బడుగుబలహీనవర్గాల కోసం తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో బీసీభరోసా బాట కార్యక్రమాన్ని 12వతేదీన ప్రారంభించడం జరిగిందని, వెనుకబడిన వర్గాల స్థితిగతులు, వారిబాధలు తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం చేపట్టామని, ఇందుకోసం 54 బీసీసాధికార కమిటీలు ఏర్పాటుచేయడం జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి, కొల్లురవీంద్ర తెలిపారు.

మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో బుధవారం ఆయనవిలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే ..

జగన్ తలకిందులుగా తపస్సుచేసినా టీడీపీ బీసీభరోసా బాటను అడ్డుకోలేడు.
“ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నబీసీలవద్దకు వెళ్లి, వారిసమస్యలు, వారిఅభిప్రాయాలు తెలుసుకునే కార్యక్రమమే బీసీభరోసా బాట. టీడీపీ కార్యక్రమాన్ని అడ్డుకోవడాని కి ప్రభుత్వంచేయాల్సిన దారుణాలన్నీచేస్తోంది. పోలీసులసాయంతో వైసీపీ గూండాల్ని అడ్డంపెట్టి, భరోసాబాటను ఆపడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు. జగన్ తలకిందులుగా తపస్సుచేసినా టీడీపీచేపట్టిన ‘బీసీ భరోసాబాట’ ను అడ్డుకోలేడు.

2019 ఎన్నికలకుముందు అధికారంకోసం అబధ్దాలు, మోసాలతో ప్రజల్ని వంచించిన జగన్మోహన్ రెడ్డి, నేడుమరలా కొత్తనాటకాలకు తెరలేపుతున్నాడు. అప్పుడు బీసీలఓట్లు కొల్లగొట్టడానికి తెలంగాణనుంచి బీసీనేతల్ని పిలిపించి ప్ర చారంచేయించాడు. జస్టిస్ ఈశ్వరయ్య, ఆర్.కృష్ణయ్యలాంటివారు తెలంగాణ నుంచి వచ్చి, రాష్ట్రంలోని బలహీనవర్గాలమనసుల్లో విజబీజాలు నాటారు.

జగన్ ను గొప్పవాడిగాచిత్రీకరించి, బీసీలఓట్లు అతనికిపడేలాచేయడంలో కృతకృత్యులైన తెలంగాణబీసీనేతలు, నాలుగేళ్లుగా జగన్ ఏపీలోని బీసీలపై చేస్తున్న దుర్మా ర్గాలు, దాడుల్ని మాత్రం ఒక్కరోజుకూడా ప్రశ్నించలేకపోయారు. గతఎన్నికల్లో పొరుగురాష్ట్ర బీసీనేతల ప్రచారంతో, బీసీలఓట్లుకొల్లగొట్టిన జగన్, రాబోయే ఎన్ని కల్లో మరలా బడుగు, బలహీనవర్గాల్ని వంచించడానికి కొత్తడ్రామాలు ఆడుతు న్నాడు. 56ఫెడరేషన్లు పెట్టి, బీసీలను ఉద్ధిరించానంటున్న జగన్, కనీసం వాటిలో కూర్చోవడానికికుర్చీలు లేకుండా చేశాడు. ఫెడరేషన్లకు రూపాయినిధు లు ఇవ్వకుండా ఉత్సవవిగ్రహాలుగా మార్చాడు.

జగన్మోహన్ రెడ్డి పంచనచేరి, బీసీలకు తీరనిద్రోహంచేసిన ఈశ్వరయ్యలాంటి వాళ్లను రాష్ట్రంలో తిరగనివ్వం. 4 ఏళ్లుగా జగన్ బీసీల్ని తప్పుడుకేసులతో హింసిస్తూ, వారిఆస్తులు ధ్వంసంచేస్తుంటే ఈశ్వరయ్యలాంటి వారు ఎందుకు నోరెత్తలేదు?

4 ఏళ్లల్లో బీసీల్ని తప్పుడుకేసులతో హింసిస్తూ, వారిపై తనపార్టీవారితో, పోలీసులతో అకారణంగా దాడులు చేయించాడు. టీడీపీరాష్ట్రఅధ్యక్షులు అచ్చెన్నా యుడుసహా, యనమల రామకృష్ణుడు, నాపై తప్పుడుకేసులుపెట్టాడు. నన్ను 54రోజులు జైల్లోఉండేలాచేశాడు. 26మంది బీసీనేతల్ని అతికిరాతకంగా చంపించి న జగన్, దాదాపు 650మందిపై తప్పుడుకేసులు పెట్టించి, భయభ్రాంతులకు గురిచేశాడు.

ఆఖరికి బీసీమహిళల్నికూడా తీవ్రఇబ్బందులకు గురిచేశాడు. స్వర్గీయ ఎన్టీఆర్ బీసీలకు కల్పించిన రిజర్వేషన్లకు కోతపెట్టిన జగన్, దాదాపు, 16,800ల మందికి రాజకీయపదవుల్ని దూరంచేశాడు. 2,600మంది బీసీల ఆస్తుల్నిదోచుకోవడం, ధ్వంసంచేయడం చేసిన జగన్, తాను బీసీలను ఉద్ధరించి నట్టు చెప్పడం ముమ్మాటికీ మోసమే. 4ఏళ్లలో బీసీలపై చేసినదారుణాల్ని కప్పి పుచ్చడానికే జగన్ కొత్తనాటకాలు మొదలెట్టాడు. ఏపీలో బీసీనేతలు లేరన్నట్టు తనకుఊడిగంచేశారనే తెలంగాణ బీసీనేతలకు జగన్ రాజ్యసభపదవి ఇచ్చాడు.
జస్టిస్ ఈశ్వరయ్య బీసీలకు ఏంచేశాడో జగన్ చెప్పగలడా? పోనీ తాను బీసీలకు ఇదిచేశానని ఈశ్వరయ్య చెప్పగలడా? హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగానికి జ్యుడిషి యరీ కమిషనర్ గా ఈశ్వరయ్య కొనసాగడం ముమ్మాటికీ దోపిడీకోసమే. తన పదవీకాలం ముగిసిందనే ఈశ్వరయ్య ఇప్పుడు జగన్ ను వ్యతిరేకిస్తున్నట్టు నాటకాలు ఆడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని కోర్టులుతప్పుపడుతున్నా, ఈశ్వ రయ్య ఇంతకాలం ఆయన్నిఎందుకు సమర్థించాడు?

సిగ్గులేకుండా పదవుల కోసం కక్కుర్తిపడిన ఈశ్వరయ్యలాంటి వ్యక్తులు రాష్ట్రంలోని బీసీలకుతీరని ద్రోహం చేశారు. జగన్ మోసాలకు బీసీలు బలికారు.

బీసీలహక్కుల్ని కాపాడటం కోసం తాము ఎంతదూరమైనావెళ్తాం. జగన్మోహన్ రెడ్డి పంచనచేరి, బలహీన వర్గాలకు తీరనిద్రోహం చేస్తున్న ఈశ్వరయ్య లాంటివాళ్లను రాష్ట్రంలో తిరగనివ్వం. బీసీల హక్కుల్ని, వారిస్వేచ్ఛను కాపాడేందుకు ప్రతిఇంటికివెళ్లి, ప్రతిబీసీకి వాస్తవాలు తెలియచేస్తాం. బీసీల్నిభయపెట్టి, తనబానిసలుగా మార్చాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగనివ్వం.” అని రవీంద్ర తేల్చిచెప్పారు.

 

LEAVE A RESPONSE