Suryaa.co.in

Andhra Pradesh Telangana

మాట్లాడుకుందాం… రండి!

– విభజన సమస్యలపై చర్చిద్దాం
– తెలంగాణ సీఎం రేవంత్‌కు ఏపీ సీఎం బాబు లేఖ
– ఈనెల 6 న భేటీ
– ఫలించిన తెలంగాణ గవర్నర్ రాయబారం

అమరావతి: విభజన సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు భేటీ అవుదామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత అపరిషృ్కతంగా ఉన్న వివిధ సమస్యలపై చర్చించి, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు ఈనెల 6న భేటీ కావాలనుకుంటున్నట్లు చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని అభినందించారు.

‘‘తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న విశేషమైన కృషికి అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అంకితభావం, నాయకత్వం తెలంగాణ పురోగతి, అభివృద్ధికి గొప్ప సహకారం అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల స్థిరమైన అభివృద్ధి, శ్రేయస్సు విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా సన్నిహిత సహకారం ముఖ్యం. అభివృద్ధి, సంక్షేమం విషయంలో విషయంలో ఉమ్మడి లక్ష్యాల దృష్ట్యా సహకారం అవసరం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా.. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీ కోసం కొత్తగా వచ్చిన తెలంగాణ గవర్నర్ రాధాకృ్షష్ణన్ చొరవ ఫలితంగానే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి మార్గం సుగమం అయినట్లు కనిపిస్తోంది.

LEAVE A RESPONSE