– మాగంటి సునీత గోపినాథ్ ని భారీ మెజారిటీతో గెలిపిద్దాం..
– బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ కి మద్దతుగా షేక్ పేట్ డివిజన్ పరిధిలోని అఖింషా కాలని, మినీ బృందావన్ కాలనీలో ఇంటి ఇంటి ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషిని ఓటర్లకు గుర్తు చేశారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ని భారీ మెజార్టీతో గెలిపించి, జూబ్లీహిల్స్లో అభివృద్ధి పరంపర కొనసాగించాలన్నారు.
అనంతరం గడిచిన రెండు సంవత్సరాల కాలంలో వివిధ పథకాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రజలకు బాకీపడ్డ డబ్బుల వివరాలు తెలియజేస్తూ కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వాహిద్,కొండా శ్రీధర్ రెడ్డి,షకీల్ అహ్మద్, అకీల్ అహ్మద్, ఖాలీక్ అహ్మద్,అమర్ అహ్మద్, సోయల్ హలీ, శ్రీధర్ చారి,భాస్కర్ నేత,శ్రీనివాస్, శ్రీకాంత్,రాజు,ఇమ్రాన్ ఖురేషి, మహమ్మద్ ఖలీల్,సంతోష్, గోపు రంజిత్,కిరణ్, పృథ్వి,శ్రీకర్, సైఫ్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.