-శాశ్వత సంక్షేమ పథకాల సృష్టికర్త వైయస్ రాజశేఖర్ రెడ్డి
-ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వైయస్సార్
-స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి కార్యక్రమంలో
రాష్ట్ర జలవనురుల శాఖా మాత్యులు అంబటి రాంబాబు
శాశ్వత సంక్షేమ పథకాల రూపకర్త వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన ఆశయాల సాధన కోసమే మన మందరం యువ ముఖ్యమంత్రి, వైయస్సార్ తనయుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నామని రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. శుక్రవారం మహానేత, స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకొని నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సమస్యల ను తెలుసుకొనేందుకు, ప్రజలకు చేరువయ్యేందుకు 1600 ల కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఆయనతో కలిసి నడిచిన అనుబంధం నాకు ఉందన్నారు. వైయస్సార్ మరణాన్ని రాష్ట్రం జీర్ణించుకోలేకపోయిందన్నారు. ఎంతోమంది ప్రజలు తీరని క్షోభకు గురయ్యారని వివరించారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదని తక్కువ స్థానాలు గెలుపొందినా అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలను ఆకున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అడగకు ప్రయత్నించినా 2019 లో జరిగిన ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అందించారని గుర్తు చేశారు. వైయస్సార్ ఆశయాల సాధనకు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే మరికొన్ని సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఘనత వైఎస్సార్కే దక్కిందన్నారు.
అనంతరం 13వ వార్డులో కౌన్సిలర్ బండి రాజ్యలక్ష్మి, మల్లికార్జున్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి.
సత్తెనపల్లి రూరల్ మండలంలో కంటేపూడి, కొమెరపూడి గ్రామాల్లో జరిగిన వైఎస్ఆర్ 13వ వర్ధంతి కార్యక్రమాలలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు రాయపాటి పురుషోత్తమరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా రైతు సలహా మండల సభ్యులు కళ్ళం, విజయభాస్కరరెడ్డిల ఆధ్వర్యంలో జరిగాయి. ఆ గ్రామాల వైయస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి మంత్రివర్యులు అంబటి రాంబాబు నివాళులర్పించారు.
ముప్పాళ్ళ మండలం, చాగంటివారిపాలెం గ్రామాలలో జరిగిన వైయస్సార్ 13 వర్ధంతి కార్యక్రమాన్ని మండల నాయకులు ఎంజీఆర్ లింగారెడ్డి,సిరిగిరి గోపాలరావు , ఇతర మండల నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మాత్యులు రాంబాబు ముందుగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ..
ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, ఉమెన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ గీతా హసంతి , వైస్ చైర్మన్లు షేక్ నాగూర్ మీరాన్ , కోటేశ్వరరావు నాయక్, కౌన్సిలర్లు అచ్యుత శివప్రసాద్, మక్కెన అచ్చయ్య, చిట్టా విజయ భాస్కర్ రెడ్డి, వెలుగూరి శరత్, కోడిరెక్క దేవదాస్, పెద్దింటి వెంకటేశ్వర్లు, ముప్పాళ్ల సర్పంచ్ సతీష్, రెండెద్దుల వెంకటేశ్వర రెడ్డి తదితరులున్నారు.