– ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ: భారత ప్రథమ సామాజికతత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడు మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా కాకాని నగర్ కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సమ సమాజ స్థాపనకు, బడుగ, బలహీన వర్గాలకు విద్యను అందిస్తూ అన్నిట్లో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయ సాధనలో అందరం నడుద్దామన్నారు.