జననానికి మరణానికి
మధ్య విరామం..
దేహానికి దేహానికి నడుమ
జీవికి ఓ ఆరామం..!
వచ్చేటపుడు
వెళ్ళేటపుడు
ఒంటరి పయనం
మధ్యలో వెంటరాని మనుషులతో గమనం..!
శాశ్వతం కాదని తెలిసినా
ఆశలు పెంచే భ్రమ
కలిసిరాని వ్యక్తుల కోసం
పడే శ్రమ..!
మొదలయ్యేటపుడు
నవ్వేదెవరో ఎరగనిది..
అంతమయ్యేటపుడు
ఏడ్చేదెవరో కాననిది..!
కనిపించని పాముపడగ
పేలిపోయే గాలిబుడగ
భయపెడితే ఒకే చావు
భయపడితే రోజూ చావే..!
రేపే అంతమని తెలిసినా
చావని ఆశ..
ఎంత తపన పడినా
సాగని శ్వాస..!
అనుబంధాల దొంతర
విలువల పాతర
మనుషుల పితలాటం..
దేవుడి నాటకం..!
ఆశనిరాశల డోలాయమానం
లిప్తపాటున కూలే విమానం
కష్టసుఖాల కదంబం
భావి ప్రేతాల కుటుంబం..!
– సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286
7995666286