Suryaa.co.in

Andhra Pradesh Crime News

గంజాయి తోటలపై మెరుపు దాడులు

– రెండు రోజుల్లో 64 ఎకరాల పంట ధ్వంసం

అల్లూరి జిల్లా ఏజెన్సీలో గంజాయి నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. గిరిజనుల్లో గంజాయి అనర్ధాలపై అవగాహన కల్పిస్తూనే.. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి తోటలు ఉంటే స్థానికుల సహకారంతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. రెండు రోజుల్లో పాడేరు ఏజెన్సీలో 64 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు.

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు, అల్లూరి జిలా పాడేరు ఏజెన్సీలో ఇంకా మారుమూల ప్రాంతంలో గంజాయి సాగు అవుతున్నట్టు పోలీసులకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఏజెన్సీలో చాలావరకు సాగును కంట్రోల్ చేసిన పోలీసులు.. పూర్తిగా నియంత్రణలోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇన్ఫర్మేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకుని గంజాయి తోటలపై ఆరాతీస్తున్నారు.

అల్లూరి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఆదేశాలతో.. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు అల్లూరు ఏజెన్సీలో గంజాయి తోటలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించారు. మారుమూల ప్రాంతాల్లో సాగుతున్న గంజాయిని నిర్వీర్యం చేస్తున్నారు. తాజాగా రెండు రోజుల్లో 64 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు పోలీసులు. జీ. మాడుగుల మండలంలో 9 ఎకరాలు, పెదబయలులో 22 ఎకరాలు, ముంచింగి పుట్టులో 33 ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్టు గుర్తించారు.

గిరిజనుల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. అల్లూరి ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిందని .. ఏజెన్సీ అనుకుని ఉన్న ఒరిస్సా లోనే గంజాయి సాగు ఎక్కువగా ఉందని దాన్ని కూడా అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రతిరోజు రెగ్యులర్గా వాహన తనిఖీలు చేస్తున్నామన్నారు పోలీసులు . రెండు రోజుల లో 64ఎకరాల్లో గంజాయి తోటలో ధ్వంసం చేసిన పోలీసులు కొంతమంది పై కేసులు పెట్టారు.

ఏవోబిలో గంజాయి సాగుపై స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నారు పోలీసులు. ఆపరేషన్ పరివర్తన లో భాగంగా 25సెంట్లలో గంజాయి తోటల ధ్వంసం చేశారు. రాళ్ల గెడ్డ – జి నేరేడుపల్లి గ్రామాల ఒడిస్సా సరిహద్దు లో గంజాయి సాగు జరుగుతున్నట్టు సీలేరు పోలీసులకు సమాచారం అందింది. దింతో అక్కడకు వెళ్లిన పోలీసులు.. గంజాయి పంట సాగు వద్దంటూ రైతుల్లో పోలీస్ అవగాహన కల్పించ్చారు. స్వచ్ఛందంగా గంజాయి పంటను పోలీసుల సమక్షంలో రాళ్లగడ్డ గ్రామస్తులు ముందుకు వచ్చారని జీకే విధి సిఐ అశోక్ కుమార్ అన్నారు.

గంజాయి సాగుకు దూరంగా ఉండాలని గిరిజనులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. చాలామంది ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపారు. పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. గంజాయి వద్దని సూచించినప్పటికీ.. ఆయా కార్యకలాపాల్లో పాల్గొంటే వారిపై కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A RESPONSE