Suryaa.co.in

Telangana

మున్నేరు పైన కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు లైన్ క్లియర్

▪️ముఖ్యమంత్రి కేసీఅర్ హామి మేరకు రూ.180 కోట్లు మంజూరు
▪️దుర్గం చెరువు తరహాలో నిర్మించేందుకు అంచనాలు సిద్దం చేస్తున్న ప్రభుత్వం
▪️నిధుల విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
▪️ఫలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి

ఖమ్మం నగరాభివృద్ది లో భాగంగా నగరం విస్తరించిన తరుణంలో ప్రజా రవాణా ఇబ్బందులు కలుగకుండా ఉండాలనే నగరంలో నాయబజార్ వద్ద మున్నేరు పై బ్రిటిష్ కాలం నాటి వంతెన కు ప్రత్యామ్నాయంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి మేరకు నూతన తీగల వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది.
గత గత సంవత్సరాల ఆగస్టు నెలలో ఇక్కడ నూతన బ్రిడ్జి నిర్మించాలనే ఉద్దేశంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్లారు.

తరచూ ట్రాఫిక్ జామ్ లు, రోడ్డు వెడల్పు తక్కువ ఉన్న కారణంగా ప్రమాదాలు, వర్షాకాలంలో వరద ఉద్రుతికి మున్నేరు బ్రిడ్జి ప్రమాదకరమా మారడం ఇలా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనల దృష్ట్యా నూతన బ్రిడ్జి నిర్మించాలని మంత్రి పువ్వాడ ప్రతిపాదించారు. నిన్న ఖమ్మం భహిరంగ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఅర్.. పువ్వాడ విజ్ఞప్తిని గుర్తు చేసుకుని, మున్నేరుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ప్రకటించిందే తడువుగా మంత్రి స్వయంగా దగ్గరుండి నేడు పరిపాలనా ఉత్తరువులు మంజూరు చేయించారు.

సుదీర్ఘ కాలంగా ప్రజల చిరకాల స్వప్నంగా ఉన్న మున్నెరుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో లైన్ క్లియర్ కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం బ్రిడ్జి 420 మీటర్ల పొడవు ఉండగా 300 మీటర్లు కేబుల్ పై నిలువగా 120 మీటర్లు RCC పై ఉండనుంది. నిర్మాణం పూర్తి అయితే ప్రజా రవాణా కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, రాకపోకలు సాఫీగా సాగనున్నాయి.

హైదరాబాద్ దుర్గం చెరువు పై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి తరహాలో, ఖమ్మం మున్నేరుపై రూ.180 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఅర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి నగర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE