సందేహాల నివృత్తికై పెన్షన్,జిపిఎఫ్ అదాలత్

Spread the love

– ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్రమౌళి సింగ్

అమరావతి,19 జనవరి:ఫెన్సన్ మరియు జిపిఎఎఫ్ లకు సంబంధించి ఉద్యోగులు మరియు డిడిఓలకు(డ్రాయింగ్ అండ్ డిస్బెర్సుమెంట్ అధికారులు)గల వివిధ సందేహాలను నివృత్తి చేసేందుకే ఫెన్సన్ మరియు జిపిఎఫ్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతోందని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్రమౌళి సింగ్ స్పష్టం చేశారు.వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈనెల 19,20 తేదీల్లో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మరియు సచివాలయం సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నపెన్షన్,జిపిఎఫ్ అదాలత్ లో గురువారం ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్రమౌళి సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా పదవీ విరమణ పొందిన కొంత మంది ఉద్యోగులకు ఫెన్సన్ పేమెంట్ ఆర్డర్ల(పిపిఓ)ను పంపిణీ చేశారు.ఈసందర్భంగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మాట్లాడుతూ పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు సకాలంలో ఫెన్సన్ ప్రతిపాదనలు సమర్పణ,జిపిఎఫ్ కు సంబంధించిన అంశాల్లోను ఉద్యోగులు మరియు సంబంధిత డిడిఓలకు గల వివిధ సందేహాలను నివృత్తి చేసే లక్ష్యంతోనే ఈ ఫెన్సన్ మరియు జిపిఎఫ్ అదాలత్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఫెన్సన్ గ్రీవియెన్సులకు సంబంధించి ప్రొవిజినల్ ఫెన్సన్ కేసులు,వెరిఫికేషన్ రిపోర్టుకు సంబంధిత కేసులు,గ్రాట్యుటీ విత్ హెల్డు,పార్టిలీ ఇస్యూడ్ కేసులకు సంబంధించి అటు ఉద్యోగులు,ఇటు డిడిఓలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడంతో పాటు అందుకు సంబంధించి వారికి గల సమస్యలను పరిష్కరించేందుకు ఈఅదాలత్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రిన్సిపల్ ఎజి చంద్రమౌళి సింగ్ తెలిపారు. అదే విధంగా జిపిఎఫ్ గ్రీవియెన్సులకు సంబంధించి జిపిఎఫ్ క్రెడిట్,డెబిట్ సంబంధిత సమస్యలు,కేప్చురింగ్ ఆఫ్ ఎంప్లాయిస్ డేటా అనగా డిడిఓల నుండి ఉద్యోగుల మొబైల్ నంబర్లు,ఇ-మెయిల్ ఐడిలు సేకరణ,జిపిఎఫ్ క్రెడిట్,డెబిట్ లకు సంబంధించిన మిస్ క్లాసిఫికేషన్ సంబంధిత అంశాలు,నామినేషన్ల సమర్పణ,షెడ్యూల్స్,వోచర్లకు సంబంధించిన వివరాలు,సందేహాలను నివృత్తి చేసే లక్ష్యంతో ఈఫెన్సన్,జిపిఎఫ్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్రమౌళి సింగ్ పేర్కొన్నారు.

ఈకార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి వి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఫెన్సన్,జిపిఎఫ్ లకు సంబంధించి ఇటు ఉద్యోగులు,అటు డిడిఓలకు గల సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈఅదాలత్ ఎంతో దోహద పడుతుందని తెలిపారు.పొరపాట్లకు ఆస్కారం లేకుండా పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు వారి ఫెన్సన్ ప్రతిపాదనలు సకాలంలో సమర్పించేందుకు, జిపిఎఫ్ విత్ డ్రాయిల్సు చేసుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంట్రామిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సందేహాల నివృత్తికి ఇక్కడ ఈఅదాలత్ ను నిర్వహించడం ఎంతో సంతోష దాయకమని అందుకు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కు ఉద్యోగుల తరుపున కృతజ్ణతలు తెలిపారు.

అంతకు ముందు చంద్రశేఖర్,విజయ్ తదితర డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ లు ఫెన్సన్ మరియు జిపిఎఫ్ లకు సంబంధించి ఉద్యోగులు, ఫించన్ దార్లు,మరియు డిడిఓలకు గల సందేహాలను నివృత్తి చేశారు. అంతేగాక పొరపాట్లు లేకుండా ఏవిధంగా ఫన్సన్ ప్రతిపాదనలు పంపాలి,జిపిఎఫ్ ఖాతాల నుండి సొమ్ము ఉప సంహరణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు అందుకు గల సందేహాలను నివృత్తి చేశారు. ఈకార్యక్రమంలో డైరెక్టర్ అఫ్ ట్రెజరీస్ మోహన రావు,పలువురు డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ లు, సచివాలయ డిఎస్(జనరల్)రామసుబ్బయ్య,సచివాలయంలోని వివిధ విభాగాలకు చెందిన డ్రాయింగ్ అండ్ డిస్బర్సుమెంట్ అధికారులు(డిడిఓ)లు, సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు,ఫెన్సర్లు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply