ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మిరియంపల్లి సచివాలయం బిల్డింగ్ యజమాని పుచ్చకాయల నాగరాజు తన ఇంటిని సచివాలయం నిర్వహణ కోసం 2020జనవరిలో అద్దెకు ఇచ్చాడు.నాటి నుండి అద్దె చెల్లింపులు జరపకపోవటం తో నాగరాజు సచివాలయ సిబ్బంది అనేక మార్లు అద్దె చెల్లించమని అడిగి విసిగి వేసారి సచివాలయ సిబ్బంది వచ్చే సమయానికి సచివాలయానికి తాళం వేసి తన ద్విచక్ర
వాహనాన్ని తలుపులకు అడ్డం గా పెట్టారు.సదరు విషయం తెలుసుకున్న అధికారులు చొరవ తీసుకొని ఈ నెలాఖరు లోగా అద్దె చెల్లిస్తామని చెప్పటంతో సచివాలయానికి వేసిన తాళం తీశారు.ఇది స్వయంగా మొన్నటి వరకు విద్య శాఖ మంత్రిగా నేడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి సురేష్ నియోజిక వర్గం లో ఈ విధంగా బిల్డింగ్ లకు అద్దె చేల్లిమ్చ్చక పోవటంతో తాళాలు వేసిన రెండవ సచివాలయం. మునుముందు ఇంకెన్ని సచివాలయాలకు ఇటువంటి పరిస్థితి వస్తుందో వేచి చూడాల్సిందే.