కరడు కట్టిన మీ నాయన అభిమానిగా అసలు నిన్ను ఎందుకు అభిమానించాలి అని అనుకునే వాళ్లలో ఒకప్పుడు నేనూ ఒకణ్ణి..!
అసలు ఒకప్పడు అభిమాన నాయకుడి కొడుకుగా నీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి అన్నా వెతికి వెతికి ఫోటో పోస్ట్ చెయ్యాల్సిన పరిస్థితి..
కానీ భలే రాటు తేలావు..భలే మార్పు చెందావు..
అసలు నువ్వు అడిగితే నాయుడు గారు ఆయన ఓటమి ఎరుగని సీటు ఇవ్వనంటారా?
నువ్వు కోరితే బాలయ్య మామ, నువ్వు రంగంలోకి దిగు అల్లుడూ అంటూ హిందూపూర్ ని నీకు వదలనంటాడా?
అయినా పులులు..సింహాలు అంటూ కుల కలరింగ్ ఇచ్చే సిల్లీ కొడుకుల్లా సేఫ్ ప్లేస్ చూసుకోకుండా..
1985 తర్వాత అస్సలు గెలవని స్థానాన్ని ఎంచుకుని నీకు గుండె ధైర్యం ఎక్కువని ప్రూవ్ చేసావ్..
తొలిసారి ఓటమి పలకరించినా తొణకక, బెణకక నిలబడ్డావ్..
వెనకడుగు వెయ్యకుండా..వెనుతిరగకుండా కుంభ స్థలాన్ని కొట్టాలని భీష్మించి మళ్ళీ అదే స్థానం నుంచి బరిలో నిలిచావ్.
సర్వే లెక్కలు చూస్తున్నప్పుడు..ఎక్సిట్ పోల్స్ వార్తలు వింటున్నప్పుడు, నీ గెలుపు ఖాయం అన్న విషయం సుస్పష్టం..అదీ భారీ మెజారిటీతో.
ఒక్కటి మాత్రం నిజం ఒక చోట ఓడిపోయాక, గెలిచిన చోటు నుంచి బరిలో నిలవాలి అనుకోవడం సేఫ్ గేమ్ అవుతుంది..
కానీ ఓడిన చోటు నుంచే గెలిచి చూపించడం నిజమైన నాయకత్వ లక్షణం అనిపించుకుంటుంది..
అందుకే నచ్చావ్..నా l అభిమాన నాయకుడి కొడుకుగా మాత్రమే కాదు..
భావితరాలు అభిమానించే అభిమాన ప్రజా నాయకుడిగా..
పసుపు జెండాను భుజాలపై మోసే, పసుపు సైన్యాన్ని నడిపించే రధ సారధిగా నచ్చావ్ ..భలే అంటే భలే నచ్చావ్.
– డాక్టర్ విద్యాసాగర్