– పోలవరం పరిహారంపై మాటతప్పిన సీఎం
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
పోలవరం నిర్వాసితుల పరిహారాన్ని పరిహాసం చేశారు జగన్ రెడ్డి. అధికారంలోకి వస్తే ఒక్కో నిర్వాసితుడికి 19 లక్షల రూపాయల పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి…ఆ తరువాత 10 లక్షలు ఇస్తానని మాట మార్చి…ఇప్పుడు 3 లక్షల రూపాయలిచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటున్న సీఎంని జగన్ ‘మోసం’ రెడ్డి అనాల్సిందే!ఈ సందర్భంగా లోకేష్.. గతంలో పరిహారానికి సంబంధించి జగన్ ఇచ్చిన హామీల పాత వీడియోను ట్యాగ్ చేశారు.