-ఉపాధి హామీ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వదిలిపెట్టలేదు
-పేదల కష్టాన్ని వైసిపి నాయకులు మింగేస్తున్నారు
– ఉపాధి హామీ కూలీల కష్టాలు తెలుసుకున్న లోకేష్
• కూలీల వద్ద ఉన్న గడ్డపార తీసుకొని మట్టిని తవ్వుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు.
• ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
• ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనిచేస్తే రూ.150 కూలీ ఇస్తున్నారు.
• ఎండపొద్దున నీడకోసం కనీసం పరదా పట్టలు, మంచినీళ్లు కూడా ఏర్పాటుచేయడం లేదు.
• పెరిగిన ధరల కారణంగా ఇప్పుడిస్తున్న కూలీ ఏ మూలకూ సరిపోవడం లేదు.• పనిదినాలు, కూలీ రేట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలి. మంచినీళ్లు, నీడ సౌకర్యం కల్పించాలి.
• గ్రామాల నుంచి పనిచేసే ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించాలి.
• పేదలకు ఇచ్చే ఉపాధి హామీ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వదిలిపెట్టలేదు.
• ఆంధ్రప్రదేశ్ లో రూ.261 కోట్ల ఉపాధి నిధులు దుర్వినియోగమైనట్లు కేంద్రమే చెప్పింది.
• ఉపాధి హామీ పథకంలో పేదల కష్టాన్ని వైసిపి నాయకులు మింగేస్తున్నారు.
• టిడిపి ప్రభుత్వ హయాంలో ఉపాధి పనులు చేసే పేదల కోసం నీడ ఏర్పాటుచేయడమే గాక ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో మజ్జిగ కూడా అందించాం.
• ఉపాధి పనుల కోసం గడ్డపారలు ఇవ్వడమేగాక, దూరాన్ని బట్టి అదనపు కూలీ చెల్లించాం.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మాట్లాడి ఉపాధి హామీ పనిదినాలు, కూలీ పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.
• వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటాం.