– స్వయం ఉపాధి కోసం తోపుడు బళ్ళు
– క్రిస్ట్మస్ కానుకగా 750 మంది పాస్టర్లకు బట్టలు
– ఉగాది కానుకగా 650 మంది పూజారులకు బట్టలు
– కంటి ఆపరేషన్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక సాయం, ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం
– ఉచిత త్రాగునీరు కోసం జలధార, ఉచిత వైద్య పరీక్షల కోసం త్వరలోనే సంజీవని ఆరోగ్య కేంద్రం
– రంజాన్ కానుకగా ముస్లిం సోదరులకు తోఫా.
– కార్యకర్తల పెళ్లిళ్లకు పెళ్లి కానుక
– లక్ష్మి నరసింహ గోల్డ్ స్మిత్ సొసైటీ ద్వారా స్వర్ణకారులకు వివిధ కార్యక్రమాలు
– వినూత్న ఆలోచనలతో మంగళగిరి ప్రజలకు దగ్గరవుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
తండ్రి పాలనలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు, టిడిపి కార్యకర్తల సంక్షేమ విభాగం అధిపతిగా ఉన్న అనుభవాన్ని మేళవించి మంగళగిరిలో సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు నారా లోకేష్.ఓడిన చోటే తిరిగి జెండా ఎగరెయ్యడానికి ఆయన చేస్తున్న కృషిని విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు.
సరికొత్త ఆలోచనలు, ప్రజలకి అందుబాటులో ఉంటూ అందరివాడు లోకేష్ అనిపించుకుంటున్నారు. ప్రజలు అవసరాలు తెలుసుకుంటూ, సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ గెలుపుకు బాటలు
వేసుకుంటున్నారు లోకేష్.కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికి స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో తోపుడు బళ్ళు అందిస్తున్నారు.
టిఫిన్ బళ్ళు, ఇస్త్రీ బళ్ళు, కూరగాయలు, పండ్ల బళ్ళు పేద ప్రజలకు అందిస్తూ వారిని తిరిగి జీవితంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.క్రిస్ట్మస్ కానుకగా 750 మంది పాస్టర్లకు బట్టలు పెట్టడంతో స్వయంగా
ఆయనే వారందరితో వాట్సప్ లో మెసేజ్ చేస్తూ వీలు దొరికిన ప్రతి సారి వారితో మాట్లాడుతూ వారి బాగోగులు తెలుసుకుంటున్నారు.
ఇప్పుడు ఉగాది కానుకగా 650 మంది పూజారులకు బట్టలు పెడుతున్నారు.శ్రీశుభకృత్ నామసంవత్సరంలో అందరికి శుభాలు జరగాలని కోరుకుంటూ భక్తునికి దేవునికి అనుసంధానంగా ఉండే పూజారులను గౌరవిస్తూ బట్టలు పంపి స్వయంగా ఆయనే శుభాకాంక్షలు తెలిపారు.నియోజకవర్గంలో
పర్యటనల్లో భాగంగా కంటి సమస్యలతో ఎదురైన వృద్దులకు కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక సాయం, ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు.
వచ్చే అరకొర కూలితో త్రాగునీరు కొనుక్కోవడం భారంగా మారిందని భావించి పేద ప్రజలకు మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో జలధార కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఎంఎస్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన జలధార కేంద్రం పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం అవ్వడంతో మరిన్ని చోట్ల విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
ఉచిత వైద్య పరీక్షల కోసం త్వరలోనే సంజీవని ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య రధం ఏర్పాటు చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు.రంజాన్ కానుకగా సుమారుగా 2 వేల మంది ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకుల తోఫా అందిచారు. కార్యకర్తల ఇళ్లలో పెళ్లిళ్లకు వధువు,వరుడికి పెళ్లి కానుకగా బట్టలు పెడుతున్నారు.
లక్ష్మి నరసింహ గోల్డ్ స్మిత్ సొసైటీ ద్వారా స్వర్ణకారులకు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. స్వర్ణకారులకు హెల్త్ క్యాంప్, ఇన్స్యూరెన్స్, లోన్స్ ఇప్పించడం ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక పక్క గడప గడప కు తిరుగుతూ ప్రజా సమస్యలు పై గళం విప్పుతూనే పాలకులు కళ్ళు తెరిపించేందుకు కొన్ని ఘోరంగా ఉన్న రోడ్ల ను సొంత నిధులతో మరమ్మత్తులు చేయించారు లోకేష్.
నియోజకవర్గంలో ఒక్కప్పుడు నిస్తేజంగా ఉన్న క్యాడర్ లోకేష్ రాకతో ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. కార్యాలయాన్ని చక్కదిద్ది అక్కడికి వచ్చే ప్రతి కార్యకర్త, ప్రజల సమస్యని పరిష్కరిస్తున్న తీరు లోకేష్ కి ప్రత్యేక గుర్తింపు తెస్తున్నాయి.
ఆవిర్భావ దినోత్సవం రోజు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాలు స్టేట్ లోనే హాట్ టాపిక్ గా మారాయి.సీఎం జగన్ ఉండే చోట పసుపు జెండా ఉవ్వెత్తున ఎగరడం, కార్యకర్తల్లో ఆ ఉత్సాహం చూసి లోకేష్ అన్ స్టాపబుల్ అంటున్నారు.
– శ్రీనివాసరెడ్డి