-నారా లోకేష్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవరకూ ఏ ఒక్క ప్రఖ్యాత కంపెనీ ఏపీవైపు కన్నెత్తి కూడా చూడలేదట. కియా వాళ్ల నాయన తెచ్చాడట. ఈయన కూడా చాలానే తెచ్చాడు. అవేంటంటే.. గుడివాడకి క్యాసినో, గుంటూరుకి గుట్కా, పులివెందులకి ఫిష్ మార్కెట్, మార్కాపురానికి మటన్ మార్ట్, విశాఖకి విధ్వంస పరిశ్రమ, మైదాతో తయారయ్యే బ్లీచింగ్, ప్రెసిడెంట్ మెడల్ వంటి ప్రఖ్యాత బ్రాండ్‌ని సొంతంగా ఆయనే తయారు చేస్తూ..రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికే అమూల్ వెన్న తెస్తున్నాడు. వినేవాళ్లు పేటీఎం బకరాలైతే..చెప్పేవాడు జగన్ రెడ్డి మరి. ఆఖరికి సంతాప తీర్మానం కూడా అసత్యాలతో నింపేయడం విచారకరం.