Suryaa.co.in

Andhra Pradesh

యువగళం పాదయాత్రలో దివ్యాంగులతో సమావేశమైన లోకేష్

-దివ్యాంగుల సమస్యలపై వినతిపత్రం అందజేత

స్థానిక సినిమా రోడ్లో గల కోకిల సెంటర్లో యువ గళం పాదయాత్ర లో విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు టిడిపి విభిన్న ప్రతిభవంతుల కాకినాడ జిల్లా అధ్యక్షులు మండపాక అప్పన్న దొరఆశ్రయ జిల్లా వికలాంగుల సమైక్య ప్రెసిడెంట్ పెన పోతుల సురేష్, వందలాది మంది విభిన్న ప్రతిభవంతులతో కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించామని ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగానే దివ్యాంగులకు కూడా సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని, దివ్యాంగుల పింఛన్ 6000 రూపాయలు పెంచాలని దివ్యాంగుల వివాహ ప్రోత్సాహం లక్షా 50 వేల రూపాయలు కేటాయించాలని, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ఒక లక్ష రూపాయలు సబ్సిడీ వరకు అందించాలని, దివ్యాంగుల విద్యార్థులకు దేశ విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించాలని, దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల తో పాటు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కల్పించాలని, దివ్యాంగులకు పంచాయతీ స్థాయి నుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, స్థాయి వరకు దివ్యాంగులకు దామాషా పద్ధతిలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని మేనిఫెస్టో రూపొందించాలని కోరారు.

దివ్యాంగులపై దాడులను అరికట్టే విధంగా కఠిన చట్టాలు తీసుకురావాలని, దివ్యాంగులకు ఉచిత గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరారు. వికలాంగుల హక్కుల చట్టం 2016 సలహా కమిటీ, విపత్తుల కమిటీ ఏర్పాటు చేయాలి పలు డిమాండ్లు తో కూడిన వినతి పత్రాన్ని నారా లోకేష్ అందించారు. ఈ కార్యక్రమంలో కొప్పాడి సత్య వెంకట్ నాగరాజు, గింజల దుర్గాప్రసాద్ యాదవ్, భారతి, కరీముల్లా, నరం శ్రీనివాసరావు, జొన్నాడ రాజు, గుణపర్తి కొండలరావు, సూరిబాబు, నాగరాజు, బి సంజీవ్, తదితర దివ్యంగా నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE