-నారా లోకేష్
కొంతమంది పోలీసులు ఖాకీ డ్రెస్ తీసేసి వైసిపి డ్రెస్ వేసుకున్నారు. శాంతిభద్రతలు గాలికొదిలి టిడిపి నాయకుల ముందు మీసం మెలేయడం, కార్యకర్తల తలలు పగలకొట్టడం, సామాన్యులను చిత్రహింసలకు గురిచెయ్యడం పనిగా పెట్టుకున్నారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో టిడిపి సర్పంచ్ భర్త రామాంజనేయులును యానిమేటర్ గా రాజీనామా చెయ్యాలని వైసిపి నేతలు బెదిరించారు. అందుకు అంగీకరించకపోవడంతో రామాంజనేయులుతో సహా మరో ఆరుగురు గ్రామస్థుల పై అక్రమ కేసులు బనాయించారు. స్వయంగా తాడిపత్రి డిఎస్పీ చైతన్య రంగంలోకి దిగి బోయ సామాజికవర్గానికి చెందిన నాగార్జున, సింహాద్రితో పాటు మరో నలుగురు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చేతి వేళ్ళు విరిగి రక్తం కారే వరకూ హింసించారు. విచారణ పేరుతో గ్రామస్థుల పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. పరిధి దాటి వైసిపి నాయకుల్లా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసుల పై చర్యలు తీసుకోవాలని డిజిపి గారిని కోరుతున్నాను. కోనుప్పలపాడు గ్రామస్థులకు టిడిపి అండగా ఉంటుంది. పోలీసుల పై ప్రైవేట్ కేసు వేస్తున్న గ్రామస్థులకు టిడిపి న్యాయ సహాయం అందిస్తుంది.