– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ఘనమైన ముఖ్యమంత్రివర్యా! మీ ఏలుబడిలో యథేచ్ఛగా సాగుతున్న మర్డర్లు,మానభంగాలు అరికట్టండయ్యా అని మేము మొరపెట్టుకుంటుంటే యాగీ చేస్తున్నామా? మీ పాపిష్టి సర్కారు రేపిస్టులకు మద్దతుగా నిలుస్తుండడంతో మరో యువతి బలైంది. శ్రీ సత్య సాయి జిల్లాలో బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్వినిపై సామూహిత్య అత్యాచారం జరిగింది. సాధిక్ అనే మానవమృగం తన ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించడం దారుణం. ఆడబిడ్డల్ని కోల్పోయిన తల్లి న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట అభాగ్యురాలిలా వేడుకుంటున్నా మీకు కనికరం లేదా?