మద్యం తోనే సంక్షేమం సాధ్యమా?

– గతంలో మద్యనిషేధమని చెప్పాం గుర్తుందా ?
– హవ్వ… అప్పుల కోసం అభివృద్ధి సంస్థ నా ?
– చట్టానికి జగన్ సర్కార్ తూట్లు
-అందుకే న్యాయ స్థానం లో పిల్ వేశాం
– దుష్ట చతుష్టయం అంటే నలుగురు రా?…150 మందా?
– ప్రజలు వాస్తవాలు గ్రహించాలి
– భవిష్యత్తు ఆదాయం తాకట్టు పెట్టి అప్పు లా… అదెక్కడ న్యాయం
– రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోన్న జగన్ ప్రభుత్వం
– ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల … వ్యవసాయం, ఆక్వా రంగాల పరిస్థితి అధోగతి
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మద్యం ఆదాయంతోనే సంక్షేమం సాధ్యమని అంటుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు విమర్శించారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల పై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ఆయన వివరించారు.

ఢిల్లీలోని తన నివాసంలో రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం చట్టాలకు తూట్లు పొడుస్తూ ఒక ప్రయత్నం విఫలమైతే, మరొక ప్రయత్నం ద్వారా అప్పులు చేయాలని చూస్తోందన్నారు. దానిలో భాగంగానే ఏపీ మీ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిందన్నారు. ఈ రాష్ట్రంలోని 10 లిక్కర్ డిపోల ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు గా పెట్టి ఎస్బిఐ బ్యాంక్ ద్వారా 25 వేల కోట్లు రుణాన్ని పొందేందుకు ప్రయత్నించిందన్నారు. గత సంవత్సరం కొంత మొత్తం రుణాన్ని తీసుకున్నప్పటికీ, చివరి 1800 కోట్ల రూపాయల రుణ విషయమై కేంద్ర ప్రభుత్వం … ఇది రాజ్యాంగ ఉల్లంఘనని అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు.

దానితో, వక్ర మార్గంలో రుణాలు పొందేందుకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించి చూపెడుతూ… ఆ ఆదాయాన్ని కార్పొరేషన్ ఆదాయంగా పేర్కొంటూ రుణాలను పొందే ప్రయత్నం చేశారన్నారు.. రెండు దశాబ్దాల భవిష్యత్తు ఆదాయాన్ని తన కాగా పెట్టి, అప్పులు చేయాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 266, 293 (3)కు పూర్తి విరుద్ధమని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

ఈ నిబంధనల ప్రకారం… రాష్ట్ర ప్రభుత్వం ఆర్ బి ఐ నుంచి మినహా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా డా డా, నేరుగా ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు వీల్లేదని తెలిపారు. ఆర్బీఐ నుంచి అప్పు ఇప్పించాలని హస్తిన చుట్టూ, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి దావత్ లు చక్కర్లు కొడుతున్నారని అన్నారు.. భావితరాల భవిష్యత్తును చిదిమేసే ప్రయత్నాన్ని జగన్ సర్కార్ చేస్తుందని, ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల కింద తాను వ్యాజ్యం దాఖలు చేసినట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు.

అయితే కోర్టు లో అడ్మిట్ అయిన ఈ వ్యాజ్యం… కోర్టు సెలవుల అనంతరం జూన్ లో విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. తాను నడుపుతున్న ప్రభుత్వాన్ని వంచించి, కేంద్రాన్ని, బ్యాంకుల్ని మోసగించి… రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న జగన్ ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశ్నిస్తున్న వారిని దుష్టచతుష్టయం అనడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపుతున్న వారిని దుష్ట చతుష్టయ మంటున్నారని, తనతో కలుపుకొని పంచమ చతుష్టయం ఉంటారేమో నని ఎద్దేవా చేశారు.. వీరిని కౌరవులపై పోరాడుతున్న పాండవులు చూడాలని పేర్కొన్నారు.

భరోసా ఇవ్వని రైతు భరోసా…
రైతు భరోసా ఈ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం 6500 రూపాయలను ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు మొత్తాన్ని కలిపి 13500 ఇస్తామని ప్రకటించిందని కానీ ఇప్పటికే 2.8 లక్షల మందికి కోతలరాయుడు ప్రభుత్వం కోత పెట్టిందని రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు. రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేసి 90 రోజులు పూర్తయిన, డబ్బులు చెల్లించడం లేదన్నారు. అయినా రైతు భరోసా కేంద్రాలకు అవార్డులు వస్తున్నాయంటే, ఆ అవార్డులు కొనుగోలు చేసినవే అయి ఉంటాయన్నారు.

గతంలో వ్యవసాయదారులకు ఎన్నో సబ్సిడీలు లభించేవని, ప్రస్తుతం ఏ ఒక్క సబ్సిడీ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రిప్ ఇరిగేషన్ తోపాటు, హార్టికల్చర్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న ఆయన, తన నియోజక పరిధిలో పెద్ద మొత్తం సాగు చేసే ఆక్వా రంగం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యుత్ విధానం వల్ల పూర్తిగా కుదేలయింది అన్నారు.

వ్యవసాయ , దాని అనుబంధ రంగాలన్నీ దెబ్బతిన్నప్పటికీ తనకు తానే రైతు బాంధవుడనని ముఖ్యమంత్రి ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు . విద్యా దీవెన పథకాన్ని నారాయణ , చైతన్య విద్యా సంస్థలు అల్లరిపాలు చేయాలని చూస్తున్నాయని , పదవతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక కూడా ఆ విద్యాసంస్థల హస్తమే ఉందని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉందని విరుచుకుపడ్డారు. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే పలువురిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అందులో నారాయణ చైతన్య విద్యా సంస్థల సిబ్బంది లేరన్నారు.

ఈ రెండు విద్యా సంస్థలకు, తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధం ఏమిటని జగన్మోహన్ రెడ్డిని, రఘురామకృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు. దేవాలయాలలో విగ్రహాల ధ్వంసం నుంచి మొదలుకొని , రథాలు కాల్చి వేసింది కూడా టిడిపి వాళ్ళే నని, అత్యాచార ఘటన నిందితులు కూడా అదే పార్టీ కార్యకర్తలని ముఖ్యమంత్రి పేర్కొనడం చూసి జనాలు నవ్వుకుంటున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

తిరుపతికి చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని పై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేస్తే, దాన్ని ముందుగానే జగన్ ప్రభుత్వం ఆత్మహత్యగా చిత్రీకరించేందని, అయినా ఆ ఘటన నిందితులు కూడా టిడిపి వారేనా ? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని తక్షణమే శిక్షించాలి తప్ప, నిందితుల్ని కాపాడే ప్రయత్నం… తప్పును ప్రభుత్వమే కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు.
దుష్ట చతుష్టయం అంటే నలుగురు రా?…150 మందా?

దుష్టచతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని… కానీ ఆ దుష్టచతుష్టయం ఎవరన్నది ప్రజలు తేల్చుకోవాలనే రఘురామకృష్ణంరాజు సూచించారు. దుష్టచతుష్టయం నుంచే కాకుండా రేప్ ల , నాన్ గవర్నెన్స్ ప్రభుత్వం నుంచి కాపాడాలని భగవంతున్ని ప్రజలు కోరుకోవాలన్నారు.. ఇష్ట చతుష్టయం అంటే నాలుగు రా?, 100 మందా?, 150 మందా?? అన్నది ప్రజలు పసిగట్టాలన్నారు.

Leave a Reply