Suryaa.co.in

Andhra Pradesh

జల్లయ్య‌ కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించిన నారా లోకేష్…

-వైసీపీ మూక‌ల చేతిలో హత్యకు గురైన టిడిపి బీసీ నాయకుడు జల్లయ్య‌ కుటుంబ సభ్యులను
-ఫోన్ లో పరామర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…
-జల్లయ్య భార్య, తండ్రి, తల్లితో ఫోన్లో మాట్లాడి ఓదార్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

జగన్ రెడ్డి చేస్తోంది సామాజిక అన్యాయం.ఒకపక్క సామాజిక న్యాయ భేరి అంటూ బస్సు యాత్రలు చేస్తూ మరోపక్క బీసీ నాయకుల్ని పక్కా ప్రణాళికతో హత్యలు చేయిస్తున్నారు.బీసీలు తనవైపు లేరనే కక్షతోనే తన సామాజిక వర్గం నేతల్ని బీసీ నాయకుల్ని మట్టుపెట్టాలని జగన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు.జ‌గ‌న్‌రెడ్డి బినామీ పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్యచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా బీసీ నేతల హత్యల వెనుక పెద్ద కుట్ర ఉంది.బీసీ నేత జల్లయ్య కుటుంబానికి టిడిపి అన్ని విధాలా అండగా ఉంటుంది.

రాజారెడ్డి రాజ్యాంగంలో హత్యలు చేసి హ్యాపీగా తిరగొచ్చు అనే భావనలో ఉన్నారు. రాబోయేది టిడిపి ప్రభుత్వం. ఖచ్చితంగా చేసిన ప్రతి నేరానికి వైసిపి నాయకులు శిక్ష అనుభవించక తప్పదు.హత్య చేసిన వారిని పట్టుకోవడం చేతగాని పోలీసులు బంధువులకు తెలియకుండా జల్లయ్య మృతదేహాన్ని తరలించడం, టిడిపి నాయకులు కనీసం నివాళులర్పించడానికి కూడా లేదని అరెస్టులు చేయడం ఆంధ్రప్రదేశ్ లో పోలీసు శాఖ దుస్థితిని తెలియజేస్తున్నాయి.

మూడేళ్లు గ్రామంలో లేకపోయినా కక్షగట్టి వెంటాడి జల్లయ్యని అతి కిరాతకంగా చంపారు.మాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా మృతదేహాన్ని తరలించారు.జల్లయ్యని హత్య చేసిన వారికి శిక్ష పడేవరకు న్యాయ‌ప‌రంగా పోరాడతాం- జల్లయ్య కుటుంబ సభ్యులు

LEAVE A RESPONSE