-యువనేతని కలిసి కృతజ్ఞతలు తెలిపిన హనీష్ యాదవ్ కుటుంబం
ఆ చిన్ని గుండెకు పెద్ద కష్టం వచ్చింది. హార్ట్ ఫెయిల్యూర్. తిరగని ఆస్పత్రి లేదు. బెంగళూరులో చికిత్సకు లక్షల ఖర్చు. దిక్కుతోచని ఆ కుటుంబానికి ఆపద్బాంధవుడి కనిపించాడు నారా లోకేష్. ఆ చిన్ని గుండె పదిలంగా ఉండేందుకు అవసరమైన వైద్య, మాట సాయమంతా లోకేష్ చేశారు. బతకడం కష్టం అనుకున్న బాబు బతికాడు. టెన్త్ పరీక్షలు రాసి పాసయ్యాడు. ఇంతటి ఆనందం పొందిన ఆ కుటుంబం నారా లోకేష్‌ని చిత్తూరు జిల్లాలో కలిసి కృతజ్ఞతలు తెలిపింది.
పూతలపట్టు నియోజకవర్గంకి చెందిన టిడిపి కార్యకర్త త్యాగరాజుది పేద కుటుంబం. వారి అబ్బాయి హనీష్ యాదవ్‌కి గుండె సంబంధిత సమస్య తీవ్రమైంది. ఏం చేయాలో పాలుపోలేదు. ఏ ఆస్పత్రికి వెళ్లినా బతకడు అని చెప్పేశారు. చివరికి బెంగళూరు ఆస్పత్రిలో చికిత్సకు ఓకే అన్నారు కానీ ఖర్చు లక్షల్లో చెప్పారు. అప్పుడే జిల్లా పర్యటనకు వచ్చిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని కలిసి సమస్య వివరించారు.
తానున్నానంటూ భరోసా ఇచ్చారు. వైద్యులు, ట్రస్ట్, టిడిపి కార్యకర్తల సంక్షేమ విభాగం సమన్వయంతో హనీష్ యాదవ్‌కి ఆపరేషన్ ఏర్పాట్లు చేశారు. అయితే హార్ట్ ఫెయిల్యూర్ దశలో ఉండడంతో 15 రోజులు ఆస్పత్రిలో ఉంచి రికవరీ అయ్యాక విజయవంతంగా ఆపరేషన్ చేశారు. కోలుకున్న హనీష్ యాదవ్ టెన్త్ క్లాస్ పరీక్షలు రాసి పాసయ్యాడు. తమ బిడ్డని బతికించి, కుటుంబంలో ఆనందం నింపిన నారా లోకేష్ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.