Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ వాళ్లు లక్ష తులాలు బాకీ

-మొన్న రెండు నెలల్లో లక్ష పెళ్లిళ్లు అయ్యాయి
-మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డికి మద్దతుగా నర్సాపూర్ నియోజక వర్గం లోని దౌల్తాబాద్‌ లో నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు..

తెలంగాణ భవిష్యత్తుకు జరుగుతున్న ఎన్నికలు ఇవి.. కేవలం పదవుల కోసం, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నిక కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది.. ఎన్ని హామీలు అమలు చేసింది.. రూ. 2 లక్షల రుణ మాఫీ చెయ్యలేదు.. రైతు బంధు రూ. 15 వేలు చెయ్యలేదు.. కళ్యాణ లక్ష్మి లేదు.. తులం బంగారం లేదు.. రూ. 4,000 పింఛన్లు ఇవ్వలేదు.. పంటకు రూ. 500 బోనస్ లేదు.. మదన్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్‌లో చేరారు? రైతులను రేవంత్ రెడ్డి మోసం చేసినందుకు కాంగ్రెస్‌లో కలిశావా?

గుంపు మేస్త్రి గూబ పగిలేలా తీర్పు ఇవ్వాలి.. కాంగ్రెస్ హామీలు మాట తప్పింది.. బాండ్ పేపర్ బౌన్స్ అయ్యింది.. వారికి శిక్ష పడాల్సిందే. రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపాడు.. బీజేపీ ధరలు పెంచింది. జీఎస్టీ పెంచింది. గ్యాస్ ధరలు పెంచింది. రేవంత్ రెడ్డికి అహంకారం వచ్చింది.. కేసీఆర్ ప్రజల తరుపున హామీల గురించి నిలదీస్తే.. కేసీఆర్‌ చెడ్డి ఊడ గొడుతా అంటున్నాడు.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలా అంటారా? ఇద్దరం దోస్తులం అని చెబుతున్నాడు.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేసీఆర్‌ను వదిలి వెళ్ళిండు.. బీజేపీ అభ్యర్థి మాటలను ప్రజలు నమ్మరు..

వెంకట్రామి రెడ్డి మంచి వ్యక్తి.. ఆస్తులు పెంచుకునేందుకు ఆయన రాజకీయాల్లోకి రాలేదు.. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుంపు మేస్త్రి గూబ పగిలేలా బీఆర్ఎస్‌కు ఓట్లు గుద్ది గెలిపించాలి.. అప్పుడే, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుంది. కాంగ్రెస్ వాళ్లు లక్ష తులాలు బాకీ ఉన్నారు. మొన్న రెండు నెలల్లో లక్ష పెళ్లిళ్లు అయ్యాయి.. అంటే ఈ కాంగ్రెస్ వాళ్లు లక్ష తులాలు బాకీ పడ్డారు

LEAVE A RESPONSE