Suryaa.co.in

Andhra Pradesh

కొబ్బ‌రికాయ కొట్ట‌టానికి వంగ‌లేని జ‌గ‌న్ కుర్రాడ‌ట‌!

-72 ఏళ్ల వ‌య‌స్సులో 27 ఏళ్ల కుర్రాడిలా ప‌రిగెత్తే బాబు గారు ముస‌లోడట!
– బ‌డాచోర్ ఎమ్మెల్యే పోలీసుల్ని పంపడం కాదు..ద‌మ్ముంటే నువ్వే రా తేల్చుకుందాం
– యువ‌గ‌ళం 23వ రోజు పాద‌యాత్ర‌లో నారా లోకేష్

క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ శంకుస్థాప‌న‌కి వెళ్లిన సీఎం జ‌గ‌న్ రెడ్డి కొబ్బ‌రికాయ కొట్ట‌టానికి వంగ‌లేక‌పోయాడ‌ని, మ‌ళ్లీ తాను కుర్రాడిని-చంద్ర‌బాబు ముస‌లాడు అంటాడ‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ జ‌గ‌న్ ని ఎద్దేవ చేశారు. త‌న పాద‌యాత్ర‌ని అడ్డుకోవాల‌ని పోలీసుల్ని పంపిన బ‌డాచోర్ ఎమ్మెల్యేకి దమ్ముంటే రావాల‌ని స‌వాల్ విసిరారు. శ్రీకాళహస్తి నియోజ‌క‌వ‌ర్గంలో 23వ రోజు మంగ‌ళ‌వారం నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర సాగింది. 300 కిలోమీట‌ర్ల మైలురాయికి చేరుకున్న తొండ‌మానుపురంలో ప్ర‌జ‌ల్ని ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా లోకేష్‌ ఏమన్నారంటే.. 300 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర పూర్త‌య్యింది. ఇక్క‌డి ప్ర‌జ‌ల తాగునీటి స‌మ‌స్య తీర్చేందుకు టిడిపి అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి వంద రోజుల్లో తాగునీటి ప‌థ‌కం పూర్తి చేసి ఇంటింటికీ కొళాయి వేసి ఉచితంగా నీరు అందిస్తాం. మైక్ ప‌ట్టుకుని మాట్లాడొద్ద‌ని జీవో1లో ఉంది. నా చేతిలో మైకు లేదు..ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు. స్టూలు ప‌ట్టుకుపోతే మ‌రో స్టూలు ప‌ట్టుకొస్తాం. ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా త‌గ్గేదే లేదు. అన్నివ‌ర్గాలు ఇబ్బందులు ప‌డుతున్నాయి.అంద‌రి త‌ర‌పున పోరాడుతున్నందుకే నా గొంతు నొక్కుతున్నారు. భ‌యం మా బ‌యోడేటాలో లేదు నాపై 21 కేసులు పెట్టారు. అయినా త‌గ్గేదేలే. అన‌ప‌ర్తిలో చంద్ర‌బాబు గారి స‌భ‌కి అనుమ‌తి ఇచ్చి మ‌ళ్లీ ర‌ద్దుచేసి చీక‌ట్లో 7 కిలోమీట‌ర్లు న‌డిపించారు..జ‌గ‌న్ ప‌త‌నం మొద‌లు అయ్యింది..జ‌గ‌న్‌ ప‌ని అయిపోయింది..అందుకే గొంతు నొక్కేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు..ఎంత స‌తాయిస్తే అంత మాట్లాడ‌తా. సాఫీగా సాగ‌నిస్తే పాద‌యాత్ర‌- అడ్డుకుంటే దండ‌యాత్ర‌.

క‌డ‌ప స్టీల్ ప్లాంట్ శంకుస్థాప‌న‌కి వెళ్లి వంగి కొబ్బ‌రి కాయ కొట్ట‌లేని జ‌గ‌న్ తాను కుర్రాడినంటాడు. 72 ఏళ్ల వ‌య‌స్సులో 27 ఏళ్ల కుర్రాడిలా ప‌రుగులు పెట్టే చంద్ర‌బాబు గారిని ముస‌లాడు అంటాడు. జీవో 1లో మైకు వాడొద్ద‌న్నారు.. నేను వాడ‌ట్లేదు.. అడ్డుకుంటానంటే ఊరుకునేది లేదు. చ‌ట్ట‌వ్య‌తిరేక జీవో1ని మేము వ్య‌తిరేకించినా చ‌ట్టాల‌ని గౌర‌విస్తాం. శాంతియుతంగా మీటింగ్ పెట్టుకుంటున్నాం. అడ్డుకోవాల‌ని చూస్తున్నారు. మా హ‌క్కుల‌నీ వ‌దులుకోం. న‌న్ను అడ్డుకోవాల‌ని పంపిన ఆ బ‌డాచోర్ ఎమ్మెల్యేకి ద‌మ్ముంటే ర‌మ్మ‌ను ఎస్ఐ. సొంత బాబాయ్ ని చంపినోడు సైకో… త‌ల్లి చెల్లిని త‌రిమేసినోడు సైకో….
ప్ర‌జ‌ల్ని వేధించేవాడు సైకో. అందుకే సైకో పోవాలి…సైకిల్ రావాలి..

LEAVE A RESPONSE