– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ఫ్యాక్షన్ నేపథ్యంతోపాటు నేర క్రూర మనస్తత్వం వున్న జగన్‌రెడ్డికి ఒక్క చాన్స్ పేరుతో ముఖ్యమంత్రి గద్దెనెక్కిస్తే ఆంధ్రప్రదేశ్ ని అరాచకప్రదేశ్‌గా మార్చేశాడు. పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ వర్గీయులపై వైసీపీ దాడి రాక్షసత్వానికి పరాకాష్ట. వేట కొడవళ్లతో మా టీడీపీ నేత కంచర్ల జల్లయ్యని చంపారు. టిడిపి కార్యకర్తలు ఎల్లయ్య, బక్కయ్యలని తీవ్రంగా గాయపరిచారు. జగన్‌రెడ్డి గారూ వందల మంది టిడిపి కార్యకర్తల్ని పొట్టనబెట్టుకున్నా మీ రక్తదాహం తీరదా? మొన్న సుబ్బయ్య, నిన్న చంద్రయ్య, నేడు జల్లయ్యని అంతం చేసిన మీరు ఇంకెంతకాలం సాగిస్తారు ఈ నరమేధం? ఆపకపోతే, తీవ్రపరిణామాలుంటాయి. అన్ని బాకీలు సెటిల్ చేస్తాం. మా కార్యకర్తల జోలికొచ్చిన ప్రతి వాడు మూల్యం చెల్లించుకోక తప్పదు.
వైసీపీ మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జల్లయ్య కుటుంబాన్ని టిడిపి ఆదుకుంటుంది. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తాం.