Suryaa.co.in

Andhra Pradesh

ఇలాంటి ఘటన మీ ఇంట్లో జరిగితే ఇంతే వెటకారంగా మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు?

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ఆడబిడ్డలు బలైపోతుంటే సిఎం జగన్ రెడ్డి గారు మహిళల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడటం విచారకరం. ఇలాంటి ఘటన మీ ఇంట్లో జరిగితే ఇంతే వెటకారంగా మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు? మీ మహిళా హోంమంత్రి గారేమో పెంపకంలో తేడా వలనే రేప్ లు జరుగుతున్నాయని మహిళల్ని అవమానపరుస్తున్నారు. ఒక యువతిని ప్రభుత్వ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం చేస్తే మీరు

ప్రతిపక్షాలు యాగీ చేస్తున్నాయి అనడం సబబేనా? అంబులెన్స్ మాఫియా వేధింపులు తట్టుకోలేక ఒక తండ్రి బిడ్డ మృత దేహాన్ని బైక్ పై తీసుకెళ్తే టిడిపి యాగీ చేస్తుంది అనడం కరెక్టేనా? మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి జగన్ రెడ్డి గారు.

LEAVE A RESPONSE