– మా అమ్మాయిని మీరు తీసుకెళ్తే అది లవ్… మీ అమ్మాయిలను మేము తీసుకొస్తే అది జిహాదా?
– ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు
ప్రజా సంగ్రామ యాత్ర నేటితో 22వ రోజుకు చేరుకుంది. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇవాళ పాదయాత్రలో పాల్గొన్నా. దొరల పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పాదయాత్రకు ప్రజలు మద్దతు ఇవ్వడమే…మా విజయం. ప్రజలు సంగ్రామ యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న trs అండతో ఎంఐఎం గుండాలు సరూర్ నగర్ లో నాగరాజు ను హత్య చేశారు. మైనారిటీ అమ్మాయిని చేసుకున్నందుకే దళిత బిడ్డను గడ్డపారతో చంపేస్తారా?Trs పార్టీ ఎంఐఎం కు భయపడి దళిత బిడ్డను చంపినా పట్టించుకోవడం లేదు. హోమ్ మంత్రి పాతబస్తీ కి మాత్రమే హోంమంత్రి. హిందూ బిడ్డలపై జరిగే దాడులు, హత్యలపై హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదు? మనుషులను చంపడం ఏం సంప్రదాయం? 90% ఉన్న మా హిందువులం అందరం ఏకమైతే…. ఎంఐఎం పరిస్థితి ఏంటో ఆలోచించాలి. మా అమ్మాయిని మీరు తీసుకెళ్తే అది లవ్… మీ అమ్మాయిలను మేము తీసుకొస్తే అది జిహాదా? నాగరాజు ను చంపిన వాళ్ళను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
దళిత సమాజం ఆలోచించాలి: – రాష్ట్ర ఎస్సి మోర్చా అధ్యక్షుడు కొప్పు బాషా
రాత్రి జరిగిన సంఘటన పై తెలంగాణ దళిత సమాజం అంతా ఆలోచించాలి. నాగరాజు, సయ్యద్ asleem సుల్తానా గత 12 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇద్దరు అంగీకారంతోనే ఆర్యసమాజ్ లో పెళ్లిచేసుకున్నారు. నిన్న సరూర్ నగర్ లో గడ్డ పారలతో ఎంఐఎం గుండాలు అతి దారుణంగా నాగరాజును హత్య చేశారు. ఘటన జరిగి 12 గంటలు దాటినా… బాల్క సుమన్, ఇతర దళిత ప్రజా ప్రతినిధులు ఎందుకు మాట్లాడడం లేదు? ఎంఐఎం తొత్తులుగా మారిన మీరు ఎందుకు మాట్లాడరు? దళితున్ని చంపేస్తే… ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ స్పందించరు. నడి రోడ్డుపై దళిత యువకుడిని చంపితే స్పందించరా? Trs దళిత ఎమ్మెల్యేలకు దళితులపై మాట్లాడే హక్కు లేదు. మైనారిటీ యువతిని దళితుడు పెళ్లి చేసుకుంటే తప్పా అని ప్రశ్నిస్తున్నా. తెల్లారితే మీడియా ముందు మాట్లాడే బాల్క సుమన్, గువ్వల బాలరాజు, గ్యాదరి కిషోర్, మెతుకు ఆనంద్… ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎందుకు స్పందించడం లేదు? ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజుని చంపితే స్పందించరా…. తూ… సిగ్గుండాలి మీ బతుకులకు. దళితులకు బీజేపీ అండగా ఉంటుంది… నాగరాజు కుటుంబానికి అండగా పోరాటం చేస్తుంది. యూపీ, జమ్మూకాశ్మీర్, కర్ణాటకలో ఏదైనా సంఘటన జరిగితే మాట్లాడే బాల్క సుమన్, గువ్వల బాలరాజు ఇప్పుడు ఎక్కడికి పోయారు?ఎంఐఎం గుండాలారా…trs గుండాలారా… మీ భరతం పడతాం. నాగరాజు కుటుంబానికి అండగా ఉండకపోతే…. మీకు చీరలు, గాజులు పంపిస్తాం.
రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్. వి సుభాష్ :
సాయంత్రం 4 గంటలకు అన్నపూర్ణ గార్డెన్స్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతుంది. ఆ తర్వాత MVS Arts College లో జరిగే భారీ బహిరంగ సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొంటారు.