– జగన్‌రెడ్డి సెక్యూరిటీ లేకుండా వస్తే జనమే పీకి పంపుతారు
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
జనాన్ని మోసగించిన వ్యక్తిని జగన్ మోసం రెడ్డి అంటామని, తనను ఎవ్వరూ పీకలేరని విర్రవీగుతున్న జగన్‌రెడ్డి సెక్యూరిటీ లేకుండా బయటకొస్తే, జనమే వెంట్రుకలన్నీ పీకి పంపుతారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. పల్నాడు జిల్లా రావలాపురంలో జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం టిడిపి కార్యకర్తలని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పసుపు జెండాని ప్రాణంగా ప్రేమించి తెలుగుదేశం కార్యకర్తలకి పాదాభివందనం.ఎన్నికలకి ముందు జగన్‌రెడ్డి అన్నీ పెంచుకుంటూ పోతానన్నాడు.జనం ఏమో సంక్షేమ పథకాలు పెంచుతూ పోతాడేమో అని ఆశపడ్డారు.సీఎం అయ్యాక పన్నులు, చార్జీలన్నీ పెంచుతూ పోతున్నాడు జగన్‌రెడ్డి. జగన్‌రెడ్డి పాలనలో రైతు ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానం.పంటలకి గిట్టుబాటు ధరలేదు.. ఏడాదికి ఇస్తామన్న 3 వేల కోట్ల ధరలస్థిరీకరణ నిధి లేదు. మంచి పనిచేసినోళ్లని మంచోడంటాం..జనాన్ని మోసం చేసిన వాడిని జగన్‌మోసపు రెడ్డి అనాలి.మెగా డిఎస్సీ, జాబ్ క్యాలెండర్ ఏదీ జగన్ మోసపు రెడ్డీ..నా వెంట్రుక పీకలేరంటోన్న జగన్ మోసపు రెడ్డీ..సెక్యూరిటీ లేకుండా బయటకి రా నీ వెంట్రుకలు జనమే పీకి పంపుతారు.
ఆడబిడ్డలకి న్యాయం చేయాలని నేను పోరాడితే అక్రమంగా అరెస్టు చేశారు..ఎన్నిసార్లయినా అరెస్టు చేసుకోండి. భయం నా బయోడేటాలో లేదు వైకాపా కుక్కలు నా మీద రాళ్లు వేయించాయి. రాళ్లు వేస్తే పారిపోను..నాది రాయలసీమ బ్లడ్..పౌరుషం నా ఇంటి పేరు.అమ్మ ఒడి మిగిలించుకోవడానికి టెన్త్ 4 లక్షల మందిని ఫెయిల్ చేశాడు. మెగా డిఎస్సీ, జాబ్ క్యాలెండర్ తీస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడు నా వెంట్రుకలు ఎవ్వరూ పీకలేరని విర్రవీగుతోన్న జగన్‌రెడ్డి సెక్యూరిటీ లేకుండా వస్తే జనమే పీకి పంపుతారు.బారికేడ్లు, పరదాలు, పోలీసులు లేకపోతే జగన్‌రెడ్డి భయంతో బయటకి రాడు.
జగన్‌రెడ్డి పాలనలో 35 మంది టిడిపి నేతలు, కార్యకర్తల్ని అంతమొందించారు. వీరిలో 25 మంది బీసీలే. టిడిపికి అండగా వుంటున్నారనే బడుగుబలహీనవర్గాల వారిని జగన్‌రెడ్డి చంపిస్తున్నాడు. సొంత బాబాయ్‌ని గొడ్డలితో అత్యంత దారుణంగా చంపింది జగన్‌రెడ్డే. తల్లి, చెల్లిని తరిమేశాడు. సొంత బాబాయ్ నీ చంపి, తల్లి చెల్లికి అన్యాయం చేసిన జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని ఎలా న్యాయం చేస్తాడు? చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయితే గంజాయి, పిచ్చి మందుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్‌రెడ్డి విజనరీ సీబీఎన్…ప్రిజనరీ జగన్.జైలులో 16 నెలలు చిప్పకూడు తినొచ్చిన జగన్‌రెడ్డి…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ జైలుకి పంపాలనుకుంటున్నాడు. జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో బాదుడే బాదుడు. బాదుడు పోవాలంటే..బాధలు పోవాలంటే బాబు రావాలి.
టిడిపి హయాంలో ఎమ్మెల్యే ఆంజనేయులు అతి ఎక్కువ నిధులు సాధించి అభివృద్ధి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా? ఆయన బొల్లా బ్రహ్మనాయుడు కాదు…కమీషన్ల బ్రహ్మనాయుడు.భార్యాభర్తల గొడవల్లో దూరి కమీషన్లు కొట్టేస్తాడు. 1 ఎకరం లక్ష రూపాయల తన భూమినే 30 లక్షల లెక్కన ప్రభుత్వానికి అమ్మేసి దోచుకున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ బ్రహ్మనాయుడు.