Suryaa.co.in

Andhra Pradesh

అంగన్వాడీ చెల్లెమ్మలపై పిచ్చిపాలకుడి ప్రతాపం

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ఒకవైపు తాను వదిలిన బాణం తిరిగి తనవైపే దూసుకు రావడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మతిభ్రమించిన జగన్ విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకు అంతిమ ఘడియలు సమీపిస్తున్న వేళ ఫ్రస్టేషన్ తో ఆయన పిచ్చి పీక్ స్టేజికి చేరింది. పిచ్చివాడి చేతిలో రాయి అటు,ఇటు తిరిగి తమ న్యాయమైన డిమాండ్ల కోసం 42రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్ వాడీల వైపు మళ్లింది.

అంగన్వాడీలను ఉద్యోగాల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం నియంతృత్వ పోకడలకు అద్దంపడుతోంది. తాటాకు చప్పుళ్లకు లొంగని అంగన్వాడీలు ఛలో విజయవాడకు పిలుపునివ్వడంతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వం అంగన్వాడీల విషయంలో తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గంలో టన్నుల కొద్దీ ఐరన్ ఫెన్సింగులు, వందలాది అదనపు బలగాలను దించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా అంగన్వాడీలు ఉక్కు సంకల్పంతో చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తోంది.

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అంగన్వాడీల ఆగ్రహజ్వాలలే అరాచక ప్రభుత్వానికి చితిమంటలు కాబోతున్నాయి. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం మూర్ఖపు చర్యలను విడనాడి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలి. జగన్ ప్రభుత్వం తొలగించే అంగన్వాడీలను, టిడిపి – జనసేన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి సర్వీసు అంతరాయం లేకుండా తిరిగి ఉద్యోగాల్లో నియమిస్తామని హామీ ఇస్తున్నాను.

LEAVE A RESPONSE