రామజన్మభూమి పోరాటంలో రాయలసీమ ముద్దు బిడ్డ గుణంపల్లి పుల్లారెడ్డి

రామ మందిరం అంటే అది గుడి కాదు
కొన్ని వందల చరిత్ర
కొన్ని వేల ప్రాణాల త్యాగం
రామనాథుడి మందిర లక్ష్యం

హిందువుల కల ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామ మందిర నిర్మాణం. అది 2024 జనవరి 22న సాకారం అవుతున్న తరుణంలో…
రామజన్మభూమి పోరాటంలో.. మన తెలుగు జాతి యోధుడు.. రాయలసీమ ముద్దు బిడ్డ!.. గుణంపల్లి పుల్లారెడ్డి గారు ఒకరు.
1990ల కాలంలో అయోధ్య రామ జన్మభూమి ఆందోళనల కేసులు కోర్టులో వాదించడానికి రోజుకు లక్షల్లో ఖర్చు వచ్చింది. దాని భరించడం విశ్వహిందూ పరిషత్(వి హెచ్. పి )’కు కష్టం అయింది. ఆరోజుల్లో దాదాపు 25 లక్షలు అవసరం అయ్యాయి.

అప్పటి VHP అధినేత అశోక్ సింగల్ హైదరాబాద్ చేరుకొని.. ఆనాటి VHP కోశాధికారి అయిన పుల్లారెడ్డికి ఈ విషయం తెలియజేశాడు. వెంటనే ఆయన… ఇంట్లోకి వెళ్లి 2 లక్షల రూపాయలను తెచ్చి ఇచ్చాడు. సాయంత్రానికి 10 లక్షలు సమకూర్చి ఇచ్చాడు.

అప్పుడు ఆయన చెప్పిన మాట… ఈనాటి వరకు తెలుగువారు గర్వపడే మాట!
“రామ జన్మభూమి కేసులో విజయం సాధించే వరకు పోరాడుదాం! దానికోసం ఎక్కడికైనా… ఎంత దూరం అయిన పోదాం! ఎన్ని త్యాగాలకైనా వెరవకుండా ముందుకు వెళ్దాం.”
ఎర్రమంజిల్ కాలనీలో ఆయన నివాసం ముందు అశోక్ సింగల్ చేతులు పట్టుకొని….
“నేను బ్రతికి ఉన్నంత వరకు… విశ్వ హిందూ పరిషత్ (VHP) కోశాధికారిగా ఉన్నంత వరకు… కోర్టు వ్యాజ్యాలకు నిధుల కొరత రానివ్వను. అవసరమైతే నా ఇల్లు అమ్మెస్తాను. నా భార్య నగలు లక్ష విలువ చేసే అభరణాలు అమ్మేస్తాను” అంటూ తన భార్య నారణయమ్మ ముందు అశోక్ సింగల్ కి హామీ ఇచ్చాడు.
ఆనంద కన్నీళ్ళతో… పుల్లారెడ్డినీ ఆత్మీయ అలింగంగం చేసుకున్నాడు అశోక్ సింగల్.
రామ మందిరం అంటే అది గుడి కాదు… కొన్ని వందల చరిత్ర… కొన్ని వేల ప్రాణాల త్యాగం…. రామనాథుడి మందిర లక్ష్యం. జై శ్రీరామ్

గమనిక: పుల్లారెడ్డి ఎవరో కాదు… పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత.

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేళ ఈ పుణ్య దంపతులను స్మరించుకుందాం.

Leave a Reply