ఓటు పుట్టినరోజు..

వెచ్ఛవెచ్ఛని పచ్ఛనోట్టు
వెతుకుతున్నాయ్
అనుకూలమైన మనిషి కోసం

అప్పుడే బయలుదేరింది
నోటు వేటకు బలహీనుడుండే చోటుకు
అస్థిపంజరాలను
కూడ వదిలరు వాల్లు
ఊపిరుంటే చాలు ఉరికురికి వస్తారు ఊరవతల నీవున్న

సిరాచుక్క వేలుకేసి
సారాయి సుక్క నోట్లో పోసి
సికెనుముక్క చేతికిచ్చి
హద్దులెరుగని సుద్ధులెన్నో చెప్పి
అభివృద్ధిని అద్దంలో చూపిస్తు
అందలం ఎక్కేస్తారు

పథకాల పంజరంలో
నిన్నుంచి పదవులెన్నో పొందుతారు
గెలిసినాంక గేలిచేసి గేటు తాళమేస్తారు
అపాయిట్మెంట్ లేదంటు
ఆయిట్మెంట్ పూస్తారు

యాచించకు ఓ మనిషి ఆలోచించు
వ్యసన చెరసాలలో నిత్య బందీవి
మాత్రం నీవుగాకు

ఓటు పుట్టినరోజు……
ఓటరు పుట్టినరోజు……

– రమణ
మచిలీపట్నం

Leave a Reply