Suryaa.co.in

Andhra Pradesh

ఆవు చేలో మేస్తే, దూడ గ‌ట్టున మేస్తుందా?

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 

ఆవు చేలో మేస్తే, దూడ గ‌ట్టున మేస్తుందా? వైసీపీ అధినేత జ‌గ‌న్‌రెడ్డి గారు త‌ల్లిని త‌రిమేసి, చెల్లిని గెంటేసి, బాబాయ్‌ని చంపేస్తే.. వైకాపా కార్య‌క‌ర్త‌లు ఊరుకుంటారా? ఇదిగో ఇలా ఊరుమీద ప‌డి అన్నెంపున్నెం ఎరుగ‌ని బాలిక‌ల‌పై మాన‌వ‌త్వానికే మాయ‌నిమ‌చ్చ‌లా దాడుల‌కి తెగ‌బ‌డుతున్నారు. నెల్లూరు జిల్లా వెంక‌టాచ‌లం మండ‌లంలో 14 ఏళ్ల బాలిక‌పై వైకాపా కార్య‌క‌ర్త నాగ‌రాజు లైంగిక‌దాడికి య‌త్నించాడు. బాలిక ప్ర‌తిఘ‌టించ‌డంతో నోట్లో యాసిడ్ పోసి, గొంతు కోసి ప‌రార‌య్యాడు. ఈ దారుణానికి పాల్ప‌డిన నాగ‌రాజు వైకాపా కార్య‌క‌ర్త కావ‌డంతో పోలీసులు ఏ క‌ట్టుక‌థ అల్లుతారో? ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ని ర‌క్షించిన‌ట్టే ర‌క్షిస్తారో? జ‌గ‌న్‌రెడ్డి సీఎం కావ‌డంతోనే నేర‌స్తులు, దోపిడీదారులు, రేపిస్టులు ఇది త‌మ రాజ్య‌మ‌న్న‌ట్టు చెల‌రేగిపోతున్నారు. వైకాపా దురాగ‌తాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌క‌పోతే రాష్ట్రంలో ఆడ‌పిల్లలు, మ‌హిళ‌లు క‌నుమ‌రుగ‌య్యే ప్ర‌మాదం ఉంది.

LEAVE A RESPONSE