నెల్లూరు ఘటన- జగన్ రెడ్డి ప్రభుత్వ శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనం

-నెల్లూరు జిల్లాలో గిరిజన చిన్నారిపై యాసిడ్ పోసి, గొంతు కోసిన ఘాతుకం… జగన్ రెడ్డి ప్రభుత్వ శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనం
-తప్పులు చేసిన వారిని జగన్ రెడ్డి వెనకేసుకురావడంతో ఉన్మాదులు రెచ్చిపోతున్నారు
-ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధించేందుకు సమయం ఉంది కాని
బాధితురాలిని పరామర్శించే తీరిక ముఖ్యమంత్రికి లేదు
-టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెంగల్రాయుడు

తప్పు చేసిన వైసీపీ నాయకులు మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలపై చర్యలు తీసుకోకుండా వెనకేసుకురావడంతో వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. దీనికి నెల్లూరు జిల్లాలో చిన్నారికి జరిగిన ఘాతుకం అద్దం పడుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెంగల్రాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…..

నెల్లూరు జిల్లాలో గిరిజన చిన్నారిపై యాసిడ్ పోసి, గొంతు కోసిన ఘాతుకం చాలా బాధాకరం. అదే ప్రాంతంలో దాదాపు 9 మంది మహిళలపై హత్యాచార ఘటనలు జరిగినట్టు వెలుగులోకి వచ్చాయి. గిరిజనులు సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతం నెల్లూరు జిల్లా. దాడికి గురైన విద్యార్ధినికి సరైన వైద్య సదుపాయం ప్రభుత్వం కల్పించలేదు. విద్యార్థులకి మేనమామ అని చెప్పుకొనే జగన్ రెడ్డి అదే జిల్లాలో ఉంటూ కనీసం బాధితురాలని పరామర్శించలేదు. న్యూడ్ విడియో కాల్ మాట్లాడిన ఎంపీ గోరంట్ల మాధవ్, అరగంట రమ్మన్న అవంతి శ్రీనివాస్, గంట రమ్మన్న అంబటి రాంబాబు వంటి వారిపై చర్యలు తీసుకోకుండా జగన్ రెడ్డి వెనకేసుకొచ్చారు. జగన్ రెడ్డి సొంత బాబాయి వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపి గుండెపోటుతో చనిపోయినట్టు చిత్రీకరించి విజయసాయి రెడ్డి సాక్షి పత్రికలలో ప్రచారం చేసుకున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ రెడ్డి ముద్దాయిలని పట్టుకుని శిక్షించలేదు.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రోజుకి సగటున 49 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం మన రాష్ట్రం క్రిమినల్ ప్రోసిజర్ కోడ్ లో, మహిళలపై జరిగే అఘాయిత్యాలలో దేశంలోనే 8వ స్థానంలో ఉంది. శిక్షించవలసిన వారే తప్పులు చేసిన వారిని కాపాడుతుండటంతో ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. పోలీస్ వ్యవస్థని పటిష్టం చేశాం, గ్రామ సచివాలయంలో మహిళా పోలీసులని అందుబాటులో ఉంచుతున్నాం, ఎక్కడా మహిళలపై అఘాయిత్యాలు జరగవని జగన్ రెడ్డి పదేపదే చెప్పుకుంటున్నాడు. జగన్ రెడ్డి చెబుతున్న మాటలకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన నివేదికకు ఎక్కడ పొంతన లేదు. జగన్ రెడ్డి అనేక కేసులని తప్పు దారి పట్టించి నిదింతులని కాపాడటంతోనే ఇలాంటి సంఘటనలు పునారవృతం అవుతున్నాయి.

రాష్ట్రంలో మహిళలపై నేరాలను అదుపులోకి తెచ్చామని డీజీపీ ప్రటించిన 24 గంటల్లోపే తిరుపతి జిల్లా కేవీబీ పురంలో చిన్నారిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మృగాళ్లపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? కనీసం చిన్నారికి మెరుగైన సాయం కూడా అందించలేదు. ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరం సీతానగరం నదీ ఒడ్డున కాబోయే భర్త సమక్షంలోనే భార్యను అత్యాచారం చేసిన వెంకటరెడ్డి మీద, నెల్లూరు జిల్లాలో విదేశీ వనితపై అత్యాచారయత్నం చేసిన వైసీపీ కార్యకర్తలపై నేటికీ చర్యలు చర్యలు తీసుకోలేదు.

ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాకి వస్తున్నందున నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వెనుక రాజకీయ కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గమైన పులివెందులలో జగన్ రెడ్డి బాబాయిని హత్య చేసిన ముద్దాయిలు ఎవరో తెలుసుకోవడంలో పోలీసుల మీద నమ్మకం లేదు, సిబిఐ కావాలని వివేకా కూతురు సునీత కోరితే.. ఆ సీబీఐ కూడ వద్దని కోర్టులో పిటీషన్ వేసిన మీరు.. నేటికి ముద్దాయిలని ఎందుకు చూపించలేకపోయారు.

2021లో మహిళలపై నేరాలకు సంబంధించి 17,752 ఘటనలు వెలుగు చూశాయి.అంటే రాష్ట్రంలో రోజుకు సగటున ఆడబిడ్డలపై 49 అఘాయిత్య ఘటనలు జరుగుతున్నాయన్నమాట. అరచకాలు పెరగడానికి మూల కారణం మద్యం. మద్యాన్ని నిషేదిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చకపోగ గంజాయి, మత్తు పదార్థాలను వైసీపీ నాయకులు వ్యాపారాలు చేస్తూ యువత భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. పవిత్రతకు మారు పేరు భారతదేశం. భారతీయ మహిళ అర్థరాత్రి స్వాతంత్ర్యంగా ఇంటి నుంచి బయటికొచ్చి తిరిగిన నాడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు అని అన్న మహాత్మా గాంధీజి మాటలు నేడు రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి.

డీజీపీ ఇచ్చిన నివేదిక: మహిళలపై నేరాలు 2018లో 13,225 గా ఉంటే 2021లో 17,736 గా 34శాతం మహిళలపై నేరాలు పెరిగాయి. భౌతిక దాడులు 46.45, ఎస్సీ,ఎస్టీలపై 13.05శాతం, మోసాలు 28.03శాతం, వేధింపులు 41శాతం, ఫోక్సో కేసులు 79.38 జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పెరిగిన నేరాల శాతం. ఈ నివేదిక వైసీపీ నాయకులు, జగన్ రెడ్డి దగ్గర లేకపోతే మా కార్యాలయంలో అడిగి తీసుకొని జగన్ రెడ్డి ఉన్మాద పాలన గురించి తెలుసుకోండి.

నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం అత్యాచారాలు 8.95 శాతం పెరిగాయి. స్టెల్ కింగ్ 24.05శాతం, లైగింక వేధింపులు 13.18శాతం, అసాల్ట్ ఆన్ ఉమెన్ విత్ ఇంట్రస్ట్ టూ అవుట్ రేజ్ హర్ మోడేస్టీ 5.52శాతం పెరిగింది. మొత్తం మహిళాలపై క్రైమ్ 3.8శాతం పెరిగింది.

జగన్ రెడ్డి మేనమామ అని చెప్పుకున్నాడు. మేనమామ అంటే తండ్రితో సమానం అనే విషయం తెలసుకొని నెల్లూరులోని బాధిత చిన్నారిని పరామర్శించాలి. ఆమెను కాపాడటానికి తగిన చర్యలు తీసుకొని, న్యాయం జరిగే విధంగా వ్యవహరించాలి. గిరిజనులలో అక్షరాస్యత తక్కువ. ఇప్పుడిప్పుడే మహిళలు తమ పిల్లలని చదువుకోవడానికి బయటికి పంపుతున్న పరిస్ధితులలో ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.

Leave a Reply