– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
పాపాలు చేయడంలో శిశుపాలుడిని మించిపోయారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఎర్రచందనం రవాణాలో నయా వీరప్పన్‌గా పేరుగాంచిన పుంగనూరు డాన్ మంత్రి అయ్యాక వైన్, మైన్, ల్యాండ్, శాండ్ మాఫియాలకి కింగ్‌పిన్ అయ్యారు. పాడిరైతుల పాలిట పా`పాల` భైరవుడయ్యాడు. అన్ని డెయిరీలు, సహకారసంఘాల కంటే లీటర్ పాలకి అతి తక్కువ ధర ఇస్తోంది పెద్దిరెడ్డి సొంత శివశక్తి డెయిరీ. ధర ఎక్కువ ఇచ్చే డెయిరీలు పాలసేకరణకి వస్తే వారిపై గూండాయిజం చేస్తోంది పెద్దిరెడ్డి గ్యాంగ్. ఇదేంటని నిలదీసిన రైతుల్ని భయపెట్టి, బెదిరిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం వల్లిగట్ల గ్రామ పాడి రైతులు శ్రీజ డెయిరీకి పాలు పోస్తుండేవారు. పెద్దిరెడ్డి శివశక్తి డెయిరీ మేనేజర్ పురుషోత్తం రెడ్డి పాల సేకరణ చేస్తే అంతుచూస్తామంటూ శ్రీజ డెయిరీ వారిని బెదిరించడం పెద్దిరెడ్డి మాఫియా కార్యకలాపాలకు పరాకాష్ట. దీంతో పాల సేకరణని శ్రీజ డెయిరీ నిలిపేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాము పాలు పారబోస్తాం కానీ, పాపాల భైరవుడు పెద్దిరెడ్డి డెయిరీకి పాలు పోయబోమంటోన్న రైతుల్ని ఏం చేస్తావు పాపాల భైరవా పెద్దిరెడ్డీ?