– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ప్రశ్నిస్తే ప్రజలైనా, ప్రతిపక్షమైనా, చివరికి అన్నదాతలైనా ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తోంది. విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్ సి ఎస్ షుగర్స్ యాజమాన్యం రెండు క్రషింగ్ సీజన్లకు రూ.16.33 కోట్లు బకాయిలు తక్షణమే చెల్లించాలని ధర్నాకు దిగిన చెరకు రైతుల పట్ల వైసీపీ సర్కారు చేయించిన అమానుషదాడిని ఖండిస్తున్నాను. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం.. సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంది. తమకు న్యాయంగా రావాల్సిన బకాయిలు అడిగితే దాష్టీకానికి పాల్పడటం చాలా అన్యాయం. తక్షణమే చెరకు రైతుల బకాయిలు చెల్లించాలి. మహిళలు, రైతులపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి. చెరకు రైతుల న్యాయమైన పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణమద్దతుగా నిలుస్తుంది.