– విధులకు ఆటంకం కల్గించిన వైసీపీ నేత దొడ్డి కిరణ్, ఆయన అనుచరులని తక్షణమే అరెస్టు చేయాలి.
– ట్విట్టర్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్
ప్రశాంత ఉత్తరాంధ్ర ప్రాంతం జగన్‌రెడ్డి గ్యాంగుల అలజడులతో అట్టుడికి పోతోంది. ఏ ముహూర్తాన విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో అడుగుపెట్టాడో కానీ, ఎక్కడ చూసినా భూకబ్జాలు-దందాలే. చివరికి గ్రామస్థాయి వైసీపీ నేతలు సైతం భూకబ్జాలకు తెగబడుతున్నారు.అడ్డుకున్న అధికారుల్ని సైతం చితక్కొడుతున్నారంటే ఎంతగా బరితెగించారో అర్థమవుతోంది.
విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్తివానిపాలెంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని వైసీపీ నేత దొడ్డి కిరణ్ నిర్మించిన గోడను తొలగించే ప్రయత్నం చేసిన రెవెన్యూ సిబ్బందిపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య.ఆక్రమణలు, కబ్జాలు వైసీపీకి పేటెంట్ హక్కులాగా, అడ్డుకునే ప్రభుత్వ సిబ్బందిని కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసి, విధులకు ఆటంకం కల్గించిన వైసీపీ నేత దొడ్డి కిరణ్, ఆయన అనుచరులని తక్షణమే అరెస్టు చేయాలి. వైసీపీ నేతల నుంచి ప్రభుత్వ సిబ్బందికి రక్షణ కల్పించాలి.