ఏపీ పోలీసులని చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోంది. తమపై వైసీపీ దాడులు చేస్తున్నా, వారి అరాచకాలకి కొమ్ముకాస్తూనే వున్నారు ఖాకీలు. ప్రభుత్వ తొత్తులుగా మారి ప్రశ్నించే ప్రజలు-ప్రతిపక్ష టిడిపి పై దాడులకీ తెగబడ్డారు. ఇన్ని చేసిన కొంతమంది పోలీసులూ చివరికి వైసీపీ మూకల బాధితులవుతున్నారు. విశాఖ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు కానిస్టేబుల్ బండి పై మద్యం, బిర్యానీ పెట్టుకుని పార్టీ చేసుకోవడం బరితెగింపుని వెల్లడిస్తోంది. సీఐపై మంత్రి చీదర పని, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పై ఎంపీ సురేష్ రౌడీ మూకల దాడి…పోలీసులకే రక్షణలేని రాష్ట్రంలో ప్రజల్ని కాపాడేదెవరు?