ఉదయం సచివాలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వేదమంత్రోచ్ఛారణలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం సచివాలయం నాలుగో బ్లాక్ రూమ్ నంబర్ 208లోని తన ఛాంబర్లో మొదట నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు
రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్, మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలిసంతకం చేసి, కేబినెట్ కు పంపారు.#NaraLokesh #AndhraPradesh pic.twitter.com/ufoAybTkqf
— Telugu Desam Party (@JaiTDP) June 24, 2024
స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు.
మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలి సంతకం చేసి, కేబినెట్ కు పంపారు. పలువురు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు.
బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, ఎస్.సవిత, టీజీ భరత్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ వేమూరి రవికుమార్, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, ప్రధాన కార్యదర్శి రవినాయుడు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం, మాజీ ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, ఏఎస్ రామకృష్ణ, బుద్ధా నాగ జగదీష్, అంగర రామ్మోహన్ రావు, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ నాగుల్ మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ కు ఆయన తల్లి నారా భువనేశ్వరి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఏపీని ఐటీ రంగంలో అభివృద్ధిపథంలో నడిపిస్తావనే నమ్మకం తనకుందని భువనేశ్వరి చెప్పారు. ఐదేళ్ల పదవీకాలం విజయవంతం కావాలని, రాష్ట్రం పురోభివృద్ధికి, ప్రజలకు సేవ చేయడానికి లోకేష్ సామర్థ్యం ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు.
రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్, మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలిసంతకం చేసి, కేబినెట్ కు పంపారు.#NaraLokesh #AndhraPradesh pic.twitter.com/ufoAybTkqf
— Telugu Desam Party (@JaiTDP) June 24, 2024
మరోవైపు ఇవాళ ఏపీ మంత్రివర్గం తొలిసారిగా భేటీ అవుతున్న విషయం తెలిసిందే. జులై నెలాఖరుకల్లా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ స్థానంలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నందున, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బడ్జెట్లో చేర్చాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు 100 రోజుల్లో అమలు చేయాల్సిన కార్యచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాలు నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది.