Suryaa.co.in

Andhra Pradesh

ఆ బుడ్డోడి పేరు మంజునాధ్

ఆ సినిమా గోల వదలండిక…..
నిన్న నేను ఒక పేద్ద సెలబ్రిటీతో ఫోటో దిగాను………
ఈయన పేరు నాగరాజు….
ఊరు మదనపల్లె.
ఆ బుడ్డోడి పేరు మంజునాధ్.
2003 లో బాబు గారి మీద అలిపిరిలో దాడి జరిగినప్పటి నుండి ఇప్పటివరకూ 114 సార్లు……. మదనపల్లె నుండి పాదయాత్రగా తిరుమల వెళ్ళాడంట నాగరాజు.
ఎందుకంటే “ఆయన ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని” అన్నాడు.
ఆ బుడ్డోడు కూడా నాలుగు సార్లు వెళ్ళాడంట.
నిన్న మంజు పుట్టినరోజు.
బాబుగారిని, లోకేష్ గారిని కలవడానికి వచ్చారు.
లోకేష్ కి విషయం తెలిసి…… వెంటనే కేక్ తెప్పించి బుడ్డోడితో కట్ చేయించారు.
ఈడ సోషల్ మీడియాలో ఒక గంట గడిపి, వేళ్ళ కొనలతో నాలుగచ్చరాలు టైప్ చేసి, నాలుగు పోస్టులు పెట్టి, అబ్బో….. పార్టీకోసం చాలా త్యాగం చేసేసామనుకునే మనకి, దాదాపు 130 కిలోమీటర్లు ఒకసారి కాదు , రెండు సార్లు కాదు…….115 సార్లు(ఇందులో ఒకసారి శ్రీకాళహస్తి) నడిచి………. “నాయకుడు” బావుండాలని దేవుడిని కోరుకునే “నాగరాజు” కి చాలా చాలా తేడా ఉంది.
అందుకే ఈయన నాకు సెలబ్రిటీ లా కనిపించాడు.

– రామారావు

LEAVE A RESPONSE