Suryaa.co.in

Andhra Pradesh

ఫెయిల్ అయిన విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకే లోకేష్ జూమ్ మీటింగ్

-టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్

ఏపీలో మునుపెన్నడూ లేని విధంగా పదో తరగతి పరీక్షలలో పాస్ పర్సంటేజ్ 67.27% గా నమోదయింది.10వ తరగతి పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మబలిదానాలను చేసుకుంటున్నారు.విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోకుండా, ప్రభుత్వం చేతకానితనానికి ఎవరు బలి కావద్దు అనే విద్యార్థులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.

నారా లోకేష్ నిర్వహిస్తున్న జూన్ మీటింగ్ లో బాలికల పేరుతో మాజీ మంత్రి కొడాలి నాని అక్రమంగా చొరబడ్డారు.బాలికల ఐడిలతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరియు వైసీపీ నాయకుడు దేవేందర్ రెడ్డి కూడా అక్రమంగా చొరబడ్డారు.ఆత్మబలిదానాలు చేసుకుంటున్న విద్యార్థులను అపహాస్యం చేయడానికే మీటింగ్ లోకి అక్రమంగా చొరబడి వెకిలి చేష్టలు చేస్తున్నారు.

10వ తరగతి విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే వైకాపా ఎమ్మెల్యేలకు నవ్వులాటగా ఉంది.పదవ తరగతి పరీక్ష పేపర్ లను కొట్టేసిన జగన్ రెడ్డి విద్యార్థులను అపహాస్యం చేయడానికే వైకాపా గాడిదలను జూమ్ మీటింగ్ లోకి పంపించారు.రాష్ట్రాన్ని మరో బీహార్ లా చేయడానికే జగన్ రెడ్డి సంకల్పించుకున్నారు.

జగన్ రెడ్డి పాపాలు విద్యార్థులకు శాపాలుగా మారాయి.విద్య లేని వాడు వింత పశువు అన్నట్లుగా, చదువులేని కొడాలి నాని వ్యవహరిస్తున్నాడు.విద్యార్థులలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఏర్పాటుచేసిన సమావేశాన్ని అపహాస్యం చేసి వంశీ, నాని వైకాపా ఎమ్మెల్యేలు సంకరజాతి పశువుల్లా వ్యవహరించారు.

LEAVE A RESPONSE