న్యూఢిల్లీ: రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు జన్మించిన బాబుకి లోకేష్ ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా బాబును ఎత్తుకొని ముద్దాడారు. అక్కడే ఉన్న మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి బండారు మాధవీలతని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.