( వాసిరెడ్డి అమర్నాథ్ )
గుర్రాలు , గాడిదలు !
ఎడ్లు , గుర్రాలు , గాడిదలు , ఒంటెలు , ఏనుగులు ..
ఒకప్పుడు వ్యవసాయం , వ్యక్తుల- సరకుల రవాణా , యుద్ధాలు… మొదలయిన వాటిలో విరివిగా వినియోగంలో ఉండేవి .
యంత్రమొచ్చింది .
వీటి అవసరం చాలా మటుకు తొలగి పోయింది .
అంటే వాటి ఉద్యోగాలు పోయాయి .
కానీ మనిషి జంతువు కాదు .
నేర్చుకొనే సామర్థ్యముంది .
మారిన పరిస్థితులకు అనుగుణంగా నేర్చుకొనే శక్తి ఉంది .
ఒకప్పుడు అంటే నలబై- యాభై ఏళ్ళ క్రితం ప్రతి ఆఫీస్ లో టైపిస్ట్ లు.. స్టేనోలు ఉండేవారు .
టకటక అని టైపు మెషిన్ ల శబ్దాలు వినబడేవి .
సందుగొందుకు ఒక టైపు ఇన్స్టిట్యూట్ ఉండేది .
డిగ్రీ చదివిన చదువుతున్న యువతీ యువకులు అక్కడ .. లోయర్ .. హయ్యర్ అని శిక్షణ పొందేవారు .
70 – 80 లలో అనేక ప్రేమాయణాలు టైపు ఇన్స్టిట్యూట్ లలో మొదలయ్యేవి .
అటుపై .. టైపు మెషిన్ స్థానంలో కంప్యూటర్ .
టైపిస్ట్ స్థానం లో డిటిపి ఆపరేటర్ పోస్ట్.
గాడిదకు పనిలేక పోయింది .
మనిషి మాత్రం టైపిస్ట్ నుంచి డిటిపి ఆపరేటర్ అయ్యాడు .
ఇదీ పరిణామం .
మరి ఇప్పుడు ?
ఇప్పుడూ అనుసరణ తప్పని సరి .
కానీ దానికి అవగాహన ఉండాలి ..
అనుసరణ… తగిన రీతిలో సాగాలి .
“1980 .. కంప్యూటర్ లొచ్చాయి .. ఉద్యోగాలు పోతాయి అని ఆందోళన ..
అది నిజం కాకపోవడం”… వద్దే మనం ఆగిపోతే …బతుకు అధోగతి .
ఇప్పుడొచ్చింది మానవ మేధస్సు కంటే … అనేక విషయాల్లో… అనేక రెట్లు సమర్థవంతంగా… శక్తియుతంగా ఆలోచించగలిగిన… స్వతహాగా నేర్చుకోగలిగిన తెలివయిన యంత్రం .
ఈ తేడా తెలుసుకోవాలి .
యంత్రాల ఉపయోగం సుమారుగా 250 సంవత్సరాల క్రితం మొదలయ్యింది .
మొదటి పారిశ్రామిక యుగం .
అటు పై విద్యుత్ వాడకం తో రెండవ పారిశ్రామిక యుగం .
కంప్యూటర్ ల వాడకం తో మూడవ పారిశ్రామిక యుగం .
మొదటి మూడు వేరు .
ఇప్పుడు కృతిమ మేధతో మొదలయిన నాలుగవ పారిశ్రామిక యుగం వేరు .
ఈ కీలక అంశాన్ని విస్మరించి… గతం లో ప్రతి పారిశ్రామిక యుగంలో యంత్రాల వాడకం తో మనుషుల అవసరాలు ఎలా పెరిగాయో … ఉద్యోగాల సంఖ్య ఎలా పెరిగిందో … ఇప్పుడు కూడా ఆలా పెరుగుతుంది … అనుకొంటే తప్పులో కాలేసినట్టే .
ఇప్పుడున్నది తెలివయిన యంత్రం .
అది ఉద్యోగాలను తినేస్తుంది .
రొటీన్ పనులను చేసేస్తుంది .
“కొత్త ఉద్యోగాలు రావా?”… అంటే … వస్తాయి .
యంత్రం నూటికి యాభై ఉద్యోగాలను తినేస్తే … కొత్తగా ఇరవై ముప్పై ఉద్యోగాలు వస్తాయి .
అంటే గతం కంటే నిరుదోగ్యం పెరుగుతుంది .
భారీగా పెరుగుతుంది .
కొంతమంది జీవిత కాల నిరుద్యోగులుగా ఉండిపోతారు .
వారిని కూర్చో పెట్టి ప్రభుత్వాలు పోషించాలి .
యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ బిచ్చగాళ్ల సంఖ్య తగ్గించేందుకే గేట్ల తాత బృందం మరో వైపునుంచి నరుక్కొని వస్తున్నారు .
అది వేరే టాపిక్ .
వచ్చే కొత్త ఉద్యోగాలు ఎలా ఉంటాయి ?
చెప్పుకొన్నాం కదా.. ఇప్పుడున్నది . గతం లో లా బుర్ర లేని యంత్రాలు కాదు .
సూపర్ ఫాస్ట్ గా నేర్చుకొంటాయి . అవి కూడా ఎవాల్వ్ అవుతున్నాయి .
వాటిని నడిపించే వారికి … అవి చేయలేని పని చేసే వారికి మాత్రమే ఇక జాబ్స్ .
ఈ ఒక్క పాయింట్ ను బాలమిత్ర క్లాసుల్లో మూడు గంటలు వివరిస్తున్నా .
అయినా టైం సరిపోదు .
ఇది అర్తం కావడం అంత వీజీ కాదు .
వీజీ కాదు …….
వీజీ కాదు ……….
వీజీ కాదు……………….
గంటల తరబడి నెట్ లో పందిలా దొర్లాడుతూ .. అడ్డమయిన మలం పోస్ట్లు తింటూ .. చదివే ఓపిక .. అర్థం చేసుకొనే శక్తి … కోల్పోయిన వారికి ఇది అర్ధం అయ్యే ఛాన్స్ లేదు .
అందుకే నా బాలమిత్ర క్లాసులు ఆన్లైన్ లో ఉండవు అని ఖరాఖండీగా చేప్పేసా .
అడుగుతున్న మిత్రులకు కోసం ఒక చిన్న ఉదాహరణ .
కేవలం కోడింగ్ , బేసిక్ ప్రోగ్రామింగ్ మాత్రం చేయగలిగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్… . ఇక ఉండవు .. రావు .
ఆ ఉద్యోగం… యంత్రం మింగిన వెలగపండు .
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ స్థానం లో
1. కృతిమమేధ ఇంజనీర్ ,
2. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ,
3. డేటా సైంటిస్ట్ ,
4. కృతిమ మేధ ప్రోడక్ట్ మేనేజర్ ,
5. కృతిమ మేధ పరిశోధన మేనేజర్ ,
6. కంప్యూటర్ విజన్ ఇంజనీర్ ,
7. రోబోటిక్స్ ఇంజనీర్ ,
8. కృతిమ మేధా విలువల నిపుణుడు ,
9. జెనరేటివ్ AI స్పెసలిస్ట్..
… లాంటి ఉద్యోగాలు వస్తాయి .
“ఇంకేమి పండగే ..
ఒక ఉద్యోగం స్థానం లో 9 ఉద్యోగాలు వస్తాయి!” అనుకొంటున్నారా .
అంత వీజీ కాదు .
వీటి కోసం కొత్త కోర్స్ లు చదవాలి .
లీనియర్ ఆల్జీబ్రా , కాలుకులస్ , స్టాటిస్టిక్స్ , డేటా విజువలైజషన్ , ఇమేజ్ ప్రాసెసింగ్ , ఆబ్జెక్ట్ డిటెక్షన్ , టెక్స్ట్ ప్రాసెసింగ్ . Q లెర్నింగ్ లాంటి వాటిలో స్పెషలైస్ చెయ్యాలి .
“ఏముంది.. ? అమీర్పేట్ లో ట్రైనింగ్ సెంటర్స్ వస్తాయి . అక్కడ 6 నెలల కోచింగ్ తీసుకొంటే పోలా ?” అనుకుంటున్నారా ?
కోడింగ్ .. సి సి ప్లస్ జావా . లాంటి వాటికైతే అమీర్పేట్ చెల్లింది .
ఇప్పుడు నేర్వాల్సిన కోర్స్ లు .. నేర్వాల్సిన విద్యలు వేరు .
మట్టిగోడపై ప్రాజెక్ట్ కట్టలేము .
పునాదులు మేటర్స్!
వాటిని నేర్వాలి అంటే .. కొన్ని స్కిల్స్ కావాలి .
1. కొల్లబోరేషన్ స్కిల్స్ కావాలి .
ఇది కావాలి అంటే.. సామజిక తెలివితేటలు భావోద్వేగ తేలితేటలు కావాలి .
ఐఐటీ ఫౌండేషన్ పేరుతో ఆరేళ్ళు సమాజానికి దూరంగా బ్రాయిలర్ కోడి లా బతికిన వారికి ఇది ఎలా వస్తుంది ?
2. ప్రాబ్లెమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలి .
ఇది కావాలి అంటే క్రిటికల్ థింకింగ్ .. లాటరల్ థింకింగ్.. .. కావాలి .
” నోరు మూసుకొని .. చెప్పింది విను . క్లాస్ అయ్యాక అయిదారు సార్లు చదివి చూడకుండా పొల్లు పోకుండా రాయి… ” టైపు బట్టీ చదువుల్లో బాల్యం గడిపిన వారికి .. క్రిటిల్ థింకింగ్ ఎలా వస్తుంది ?
3. అన్నింటికీ మించి రోబో యుగం లో పని దొరకాలంటే .. సృజనాత్మక శక్తి కావాలి .
మొబైల్ చేతిలో ఉంటే అది చస్తుంది .
హై టెక్కు రీతిలో పిల్లలని పెంచిన వారికి ఈ పాయింట్ అర్థం కావడానికి ఏడు జన్మలు చాలవు .
పైన ఒక ఉదాహరణలో టైపిస్ట్ స్థానం లో డిటిపి ఆపరేటర్ వచ్చింది అనుకొన్నాము .
ఇప్పుడు కృతిమ మేధ యుగం లో AI … టైపు చేస్తుంది . కంటెంట్ జనరేట్ చేస్తుంది .
ఇంకెక్కడ ఉద్యోగం ?
అంత వీజీ కాదు .
చాట్ జిపిటి కి… గ్రోక మామకు మించి రాయాలి .
వాసిరెడ్డి అమర్నాథ్ లా రాయాలి .
రాయాలి అంటే ఏముండాలి ?
సృజన .
కుశాగ్ర బుద్ధి .
అన్నిటికి మించి గుండెతలుపులు తడుతూ రాసే శక్తి ఉండాలి . అంటే సామజిక భావోద్వేగ తెలివితేటలు … బాష పై పట్టు .
AI అంటే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ .
దీని తలతన్నాలి అనే సంకల్పం తో అమర్నాథ్ ఇంటలిజెన్స్ డెవలప్ చేసుకొన్నా .. నిరంతర అధ్యనం .. ఆత్మ విశ్వాసం తో .
తాను నేర్చింది నలుగురికీ నేర్పితేనే గురువుకు తృప్తి .
బాలమిత్ర కు అదే మూలం .
ఇదో పెద్ద టాపిక్ లెండి మాస్టారు .
తెలుగు జాతి ఈ విషయాల్ని ముప్పై ఏళ్ళ నాడే మరచింది . చదువంటే మార్కులు .. అటు పై సాఫ్ట్ వేర్ జాబ్ .
అని రెండు తరాలు బతికేసింది .
హ్యాపీ గా బతికేసింది .
ఇప్పుడేంటి ఈ గోల ?
కొడగు పంది కూర గురించి .. ఆ పెళ్ళిలో మిగతా వంటకాలు గురించి హ్యాపీగా చదువుతుంటే .. ఈ వాసిరెడ్డి అమర్నాథ్ ఏంటి ?
“ఉద్యోగాలే ఉండవు . సాఫ్ట్ వేర్ ఆఫీస్ లు ఎత్తి పోతాయి కార్లు అమ్మకాన్ని వస్తాయి” అంటూ ఏదో వెధవ వాగుడు ??
ముందు ఆలా అంటాడు ..
తరువాత” నేను ఆలా అనలేదు అంటాడు .”
ఇంతకీ అన్నట్టా ?
లేనట్లా ?
మూడు ముక్కలో చెప్పడేంది ?
ఎప్పుడూ సోది .. సోది ..
పొద్దునే చేంతాడంత పోస్ట్లు పెడుతాడు .
ఏదో పోనీ అని చదివి పెడుతుంటే ..
ఇంకా రెచ్చి పోయి .. పోస్ట్లు పెడుతుంటాడు.
కృతిమ మేధ వల్ల జాబ్స్ పోతాయి అనుకోవడం మూర్కత్వం .
చీర్స్ .
… ఇదీ కొంతమంది మాట . ఆలోచన .
“ఉద్యోగాలు పోవు . లెక్కలు మిక్కుటంగా వస్తాయి . ఆందోళన వద్దు . కంగారొద్దు” అన్న మేధావులకు ఒక మాట
హ్యాపీగా కొడగు పందికూర, హైదరాబాద్ బిర్యానీ.. తిని ఉపర్ షేర్వాణీ తో … అందర్ పేరేషానీ కాకుండా .. నాలుగు HPV వాక్ సీన్ లు గుచ్చుకొని బతకండి .
గేట్ల తాత జిందాబాద్!