Suryaa.co.in

Andhra Pradesh

తిమింగలం సొరచేపల సంరక్షణార్థం దీర్ఘకాలిక పరిరక్షణ ప్రయోగాలు

– ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి వై. మధుసూదన్ రెడ్డి

అమరావతి: ఆగస్ట్ 30:: జలచరాలు , వన్యప్రాణులు, తిమింగలం సొరచేపల సంరక్షణార్థం దీర్ఘకాలిక పరిరక్షణ ప్రయోగాలు చేపట్టాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఈ ప్రయత్నాలకు ఎపుడూ సిద్ధంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి వై. మధుసూదన్ రెడ్డి అన్నారు.

మంగళవారం అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో ఇంటర్నేషనల్ వేల్ షార్క్ డే సందర్బంగా ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ఎలాన్గ్ ఏపీ కోస్ట్ అన్న అంశంపై నిర్వహించిన వెబినార్ లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో తెలిసిన అతిపెద్ద ఉష్ణ మండల సొర చేప ఇదని, ఉపరితలానికి దగ్గరగా ఈదుతూ, కేవలం నాచుమొక్కలను ఆహారంగా తీసుకుంటుందని వివరించారు.నీటిలోను, భూమిమీద నివసించే జంతువుల్లో తిమింగలపు సొరచేపే అతిపెద్ద క్షీరదమని ఆయన వివరించారు. మనదేశంలో అత్యంత పొడవైన సముద్ర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో ఉందని మొత్తం 974 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని తెలిపారు.

రాష్ట్రంలోని మొత్తం వన్య సముద్రజీవుల సంరక్షణ ప్రాంతాలలో 3 కేంద్రాలు సముద్రతీర ప్రాంతాలలోనే ఉన్నాయని తెలిపారు. తిమింగలం సొరచేపలు ప్రపంచంలోనే అతిపెద్ద జలచరాలని , వాటి ఉనికి మన తీరా ప్రాంతానికి ఎంతగానో మేలు చేస్తుందనే ఆయన వివరించారు. తిమింగలం సొరచేపలు, వాటి మాంసం,తోలు, చేపనూనెలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉందని తెలిపారు. కానీ ఈరోజు నిర్లక్ష్య వేటకారుల బారిన పడీ ప్రమాదపు అంచుల్లో ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

వన్యప్రాణుల ట్రస్ట్ ,తూర్పుగోదావరి రివరిన్ విభాగం, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలు సంయుక్తంగా వన్య, మత్స్య ప్రాణుల సంరక్షణకు పూనుకున్నాయని తెలిపారు. ఏడేళ్లక్రితం ప్రారంభంబైన ఈ కార్యక్రమం వన్యప్రాణుల జీవనశైలి ,వాటి మనుగడ , సంతతి పెంపొందించడంతో పాటు వాటి అభివృద్ధికి కృషిచేస్తుందని తెలిపారు. తీరప్రాంతాలలోని 40 గ్రామాలలో వేలాది ప్రజలను చైతన్యపరుస్తూ సాగిన ఈ కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇస్తున్నదని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతి చేసి మరిన్ని ప్రయోగాత్మక మార్పులు తీసుకురానున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ ఒప్పందాలలో మరింత నిధులను సమకూరుస్తూ నాలెడ్జి ట్రాన్స్ఫర్ విధానాలను అనుసరిస్తూ మరెంతో గుణాత్మకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించనున్నామని తెలిపారు. మన సముద్రపు సుందర సొరచేపలు సంరక్షణకు అందరం కలసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియ పాండే అధ్యక్షత వహించారు.

కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఏకేనాయక్ , అడిషనల్ పీసీసీఎఫ్ లు ఆర్కే సుమన్, గోపీనాధ , సీసీఎఫ్ శ్రీనివాసరెడ్డి,డీసీఎఫ్ నాగమనిశ్వరి , మాల్దేవ్స్ వేల్ షార్క్ రీచేర్చి ప్రోగ్రాం ఆపరేషన్స్ మేనేజర్ క్లారా కానోవాస్ పెరెజ్ , జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైన్టిస్ట్ డాక్టర్ బసుదేవ్ త్రిపాఠి , ఫిలింమేకర్ మలైకావాజ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE