Suryaa.co.in

Andhra Pradesh

రేపు నీ తల ఎక్కడ పెట్టుకుంటావో చూసుకో బాబూ..

రేపు (శుక్రవారం) రాష్ట్రంలో ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’
– ఆరు నూరైనా.. ఆ పండుగ జరిగి తీరుతుంది
– ఒకే ప్రాంతంలో 50 వేలకు పైగా ఇళ్ల పట్టాలివ్వడం చరిత్ర
– అంబేద్కర్‌ భావజాలాన్ని భుజాన వేసుకున్న వ్యక్తి సీఎం
– రాజధాని రైతులను మోసం చేసింది చంద్రబాబు
– అక్కడ నిరుపేదలకు ఇళ్ల పట్టాలివ్వకుండా కుతంత్రాలు
– రైతుల పేరుతో సుప్రీంకోర్టు వరకు వెళ్లిన చంద్రబాబు
– కోర్టు మొట్టికాయలు వేసినా కుయుక్తులు మానని బాబు
– రైతుల పేరుతో ఆందోళనలు, ఉద్యమాలకు కుట్రలు
– ఎవరి కోసం బాబూ.. నీ ప్రయత్నాలు? ఎవరికి ఏం లాభం?
– ఇన్ని చేసి రేపు ఎన్నికల్లో మా ఓట్లు ఎలా అడుగుతావు బాబూ?
– ప్రెస్‌మీట్‌లో సూటిగా ప్రశ్నించిన మంత్రి మేరుగ నాగార్జున

రాష్ట్రంలో ఓ పెద్ద సామాజిక పండగ:
– రాజధాని ప్రాంతంలో రేపు (శుక్రవారం) ఒక గొప్ప సామాజిన న్యాయ పండగ జరగబోతోంది.
– చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ఆరు నూరైనా ఆ పండగ జరిగి తీరుతుంది.
– మరి నీ తల ఎక్కడ పెట్టుకుంటావు బాబూ?
– కోర్టులను కూడా లెక్క చేయకుండా నువ్వు ఉద్యమాలు చేయిస్తున్న వాటికి చెల్లుచీటి పాడబోతున్నాం.
– కోర్టుల ఆదేశాలను లెక్క చేయకుండా.. డబ్బుతో ఆట ఆడిస్తున్న వ్యవహారానికీ మంగళం పాడతాం.

ఇది ఒక చరిత్ర:
– రాజధాని ప్రాంతంలో 50 వేలకు పైగా ఇళ్ల పట్టాలివ్వాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నిర్ణయించారు. ఒక్కో పట్టా దాదాపు రూ. 10 లక్షల విలువ చేస్తుంది.
– కానీ అమరావతి ప్రాంతంలో నిరుపేదలు ఉండకూడదు. వారికి అక్కడ చోటు ఉండకూడదన్నది చంద్రబాబు అభిమతం.
– అందుకే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు అన్ని స్థాయిల్లో కుయుక్తులు పన్నారు. కృతిమ ఉద్యమాలు చేయించారు.
– చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు.
– కానీ చివరకు న్యాయమే గెలిచింది. నిరుపేదల పక్షాన పోరాడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు సుప్రీంకోర్టు కూడా తన తీర్పుతో మద్దతు ప్రకటించింది.
– చంద్రబాబు అనే రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌కు కోర్టులు మొట్టికాయలు వేసినా సిగ్గు రాలేదు.
– ఒకే చోట, ఒకే ప్రాంతంలో 50 వేలకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఒక గొప్ప చరిత్ర.

ఏనాడైనా ఆలోచించావా బాబూ?:
– పాపం రాజధాని ప్రాంత రైతులు నీవల్ల దగా పడ్డారు. నిన్ను నమ్మి మోసపోయారు.
– సీఎం వైయస్‌ జగన్‌ రైతు పక్షపాతి. చంద్రబాబు మాదిరిగా వాడుకుని వదిలేసే రకం కాదు.
– పేదలు సమాజంలోని అన్ని కులాలతో సమానంగా బతకాలని భావించి వారి అభ్యున్నతికి తోడ్పడుతున్న నాయకుడు జగన్‌.
– నువ్వు ఏనాడైనా ఆ పేదల కోసం ఆలోచించావా చంద్రబాబూ?
– కొన్ని తోక పత్రికలు, ఛానళ్లను అండగా పెట్టుకుని రాజకీయం చేస్తున్నావు. అదే నీ రాజకీయ జీవితం.

బాబును నమ్మి మోసపోయిన రైతులు:
– రాష్ట్ర ప్రజలను మోసం చేసి వారి జీవితాలతో చెలగాటమాడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.
– ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో రైతులు, ప్రజలను ఆయన ఒక ఆట ఆడుకుంటున్నాడు.
– హాయిగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులను చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లా మారి, వారి మాయమాటలు చెప్పి మోసం చేశాడు.
– రియల్‌ ఎస్టేట్, వ్యాపారం చేస్తున్న వారిని రాజధాని ప్రాంతానికి తీసుకొచ్చి ఒక్క సారే భూముల ధరలు పెంచాడు.
– ఆశ పడ్డ రైతులను ఒక్క సారిగా కుదేలు చేశాడు.
– అధికారంలో ఉన్నప్పుడు రాజధాని కట్టలేని వాడు, అధికారంలో ఉన్నప్పుడు ఆ భూములన్నీ కాజేయాలనుకున్న బాబు.. ఇప్పుడు చేతులెత్తేశాడు.

సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా..:
– జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారు.
– వ్యవసాయం చేసుకునే రైతులతో పాటు కౌలు రైతులు, రైతు కూలీలు బాగుండాలని కోరుకున్నారు.
– కానీ చంద్రబాబు మాత్రం తన వైఖరి వీడలేదు. అమరావతిలో నిరుపేదలు ఉండకూడదన్నది ఆయన అభిమతం.
– అందుకే కొందరు పెత్తందార్లకు అండగా నిల్చి, ఈ ప్రాంతంలో కృతిమ ఉద్యమాలకు తెర తీశాడు.
– కానీ అందులో నిజమైన రైతులు లేకపోవడం వల్ల.. ప్రజలు అన్ని వాస్తవాలు గ్రహించారు.
– చివరకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా.. చంద్రబాబు మారలేదు.
– నిరుపేదలకు నాడు, నేడు అండగా నిల్చిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఇప్పుడు వారికి రాజధానిలో ఇళ్ల పట్టాలు, ఇళ్లు ఇస్తున్నారు.

జగన్‌ది అంబేడ్కర్‌ భావజాలం:
– ఉద్యమాలు అని చెప్పుకునే వారు, అంబేద్కర్‌ పేరు చెప్పి పార్టీలు పెట్టుకున్న కొంత మంది నీచులు పేద వారికి ఇళ్ల పట్టాలిస్తుంటే అడ్డుకోవడం ఎంత సిగ్గు చేటు.
– అంబేడ్కర్‌ భావజాలాన్ని భుజాన వేసుకుని పేదవారికి జగన్‌ గారు ఇళ్ల పట్టాలిస్తుంటే చంద్రబాబు కోర్టులకు వెళ్లాడు.
– కొందరు పెత్తందార్లకు డబ్బులిచ్చి కృతిమ ఉద్యమాలు చేయిస్తున్నాడు. ఎవరి కోసం ఆ ఉద్యమాలు చేస్తున్నారో సమాధానం చెప్పాలి.
– ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా?. బీసీల తోక కత్తిరిస్తాను. వారు జడ్జీలుగా పనికిరారు.. అన్న చంద్రబాబు.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ.. నిరుపేదల వ్యతిరేకి.
– ఇన్ని చేసిన చంద్రబాబు, వచ్చే ఎన్నికల్లో మా ఓట్లు ఎలా అడుగుతారు?.

అన్నింట్లో పేదలకు అగ్ర తాంబూలం:
– అమరావతిలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చివరకు సుప్రీంకోర్టు కూడా చెప్పింది.
– మరి అలాంటప్పుడు అవి చట్టబద్ధత లేనివి ఎలా అవుతాయి?
– చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా పేదలకు పట్టాలిచ్చి తీరతాం.
– రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం అమలు చేసినా.. అందులో మెజార్టీ లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. ఏ స్కీంలో అయినా అగ్రతాంబూలం పేదలకే.

అయినా చంద్రబాబు కుయుక్తులు:
– పేదవాడి ఇంటి స్థలం ఇస్తుంటే ధర్నా ఎవరు చేస్తారు? ఎవరు ఆ పని చేయిస్తారు?
– మూర్ఖులు, కర్కశంగా బతుకుతున్న వారు మాత్రమే అలాంటివి చేస్తారు.
– వారి వల్ల అమాయకులు ఇబ్బంది పడుతున్నారు.
– ఏది ఏమైనా ఒక గొప్ప చారిత్రాత్మక కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తే చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE