పల్నాడు జిల్లా: చిలకలూరిపేట పట్టణ పరిధిలోని శివ ప్రియ నగర్ లో ప్రమాదవశాత్తు ఒక లారీ అగ్నికి ఆహుతయ్యి… ఇంకో లారీ వద్దకు దూసకెళ్లతంతో ఇంకో లారీ కూడా మంటలు వ్యాపించాయి. పట్టణ పరిధిలోని శివ ప్రియ నగర్ లో సాయంత్రం నాలుగు గంటలకు ఈ సంఘటన జరిగింది. గణపవరానికి చెందిన వెంకటేశులు ప్రత్తి లోడ్ లారీ ని అన్న్లోడ్ చేసి శివ ప్రియ నగర్ లో ఆఫీస్ వద్ద ఉంచారు. దీంతో లారీలో ఒకసారి మంటలు ఎగిసిపడడంతో లారీ ముందు కదిలీ రెండు లారీలు మధ్యలోకేల్లింది. దీంతో డ్రైవర్లు ఒక లారీని వెంటనే పక్కకు లాగారు. ఈ సంఘటనలో రెండు లారీలు తగలబడి సుమారు ఐదు నుంచి ఆరు లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తుంది. అగ్నిమాపక అధికారులు వచ్చి మంటలను అదుపు చేశారు. రెండో లారీ చిలకలూరిపేట పట్టణానికి చెందిన శ్రీనివాసరావుగా తెలుస్తుంది.