Suryaa.co.in

Telangana

మహిళలకు మోదీ పెద్దపీట

-మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ మరియు మగ్గం వర్క్ నైపుణ్య శిక్షణ ప్రధానమంత్రి ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం
– రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్

అడ్డగుట్ట డివిజన్ తుకారం గేట్ కొండ రెడ్డి నగర్ నందు మహిళలకు ఉచిత శిక్షణ కార్యాలయం మేకల కీర్తి హర్షకిరణ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కన్నాభిరామ్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే.లక్ష్మణ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ 9 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. గతంలో ఎన్నడు లేని విధంగా మహిళలను అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోతున్నది బిజెపి ప్రభుత్వం. ప్రపంచ దేశాలలోని మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక ప్రధాని మన నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో మహిళలను భాగస్వామ్యం చేస్తున్నారు. స్వయం ఉపాధి నైపుణ్య శిక్షణ ద్వారా మహిళల కాళ్ళ మీద వాళ్లు నిలబడే విధంగా ఆర్థిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వబడుతుంది.

మగవాళ్లకు దీటుగా ఇంట్లోనే ఉండి కుటుంబ పోషణకు మహిళలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. నైపుణ్యం ఇచ్చి ప్రభుత్వ రుణాలు కూడా అందించి ప్రోత్సహిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు కూడా ఈరోజు ఈ నైపుణ్య శిక్షణ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. నాలుగు డివిజన్లలో నైపుణ్య శిక్షణ ద్వారా మహిళలకు అన్ని రంగాలలో సహకారo అందిస్తున్న మేకల కీర్తి హర్షకిరణ్ అభినందిస్తున్నాను.

ఇలాంటి మరెన్నో కార్యక్రమాలలో మునుముందు అందరు విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ పేద ప్రజల కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా నరేంద్ర మోడీ ఫలితాలను అందుకోవాలని తద్వారా సమాజానికి ఎంతో ఉపయోగపడాలని మహిళలకు సూచించడం జరిగింది.

కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, జిల్లా కార్యదర్శి కనకట్ల హరి, ప్రకాష్ గౌడ్,వీరన్న, కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి, బండపల్లి సతీష్, ఆదం విజయకుమార్, అధికార ప్రతినిధులు ప్రభు గుప్తా,శారదా మల్లేష్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ ముదిరాజ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు బిక్షపతి యాదవ్,మహిళా నాయకురాలు అనిత, అనూష, కళావతి, డివిజన్ అధ్యక్షులు అంబాల మహేష్, శ్రీధర్, హనుమంత్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిలు రవీందర్, సాయి గంగపుత్ర, బీజేవైమ్ నాయకులు శివాజీ,ఉదయ్ కుమార్ యాదవ్, హంస రాజ్, నరసింహ, వీరేష్, శంకర్, విజయ ముదిరాజ్ , రాజ్ కుమార్ నేత, వనమాల శీను,మరియు మహిళలు, జిల్లా డివిజన్ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.

LEAVE A RESPONSE